అజారుద్దీన్ వ్యాఖ్యలకు అపెక్స్ కౌన్సిల్ కౌంటర్

అజారుద్దీన్ వ్యాఖ్యలకు అపెక్స్ కౌన్సిల్ కౌంటర్

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ (హెచ్‌‌సీఏ) అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను తొలగించడంపై వివాదం రేగుతోంది. ఈ నిర్ణయంపై అజారుద్దీన్ ఫైర్ అయ్యాడు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌లో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారని అజార్ ఆరోపించాడు. వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయంగా చెబితే ఎలా అని ప్రశ్నించాడు. తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని విమర్శించాడు. కాగా, అజార్ వ్యాఖ్యలపై అపెక్స్ కౌన్సిల్ స్పందించింది. లోధా సిఫార్సుల నిబంధనల మేరకే నోటీసులు జారీ చేశామని స్పష్టం చేసింది. 

‘అపెక్స్ కౌన్సిల్‌‌లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులం అజార్‌కు షోకాజ్ నోటీస్ పంపించాం. ఆ ఐదుగురు ఒక గ్రూప్ అని ఆయన అనడం కరెక్ట్ కాదు. ఆ ఐదుగురే అపెక్స్ కమిటీ ఎలెక్టెడ్ బాడీ. అపెక్స్ కమిటీలో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. అందులో ఒకరు ప్రెసిడెంట్ అజార్. మిగిలిన వాళ్లలో మెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు, ఉమెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు ఉన్నారు. మిగతా ఐదుగురే అసలైన అపెక్స్ కమిటీ. ఆ ఐదుగురు తీసుకున్న నిర్ణయమే ఈ షోకాజ్ నోటీసులు. ఈ రోజు నుంచి అజారుద్దీన్ ప్రెసిడెంట్ కాదు. ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదు. అజారుద్దీ‌న్ కోర్టుకు వెళ్లి ఫైట్ చేసుకోవచ్చు. హెచ్‌‌సీఏ మీటింగ్‌‌‌కు అజార్ వ్యక్తిగతంగా వస్తాడు కానీ ప్రెసిడెంట్‌‌లా కాదు’ అని అపెక్స్ కమిటీ కౌంటర్ ఇచ్చింది.