మళ్లీ మోస్ట్ హ్యాపెనింగ్స్ తో బిజీబిజీగా మారిపోయిన సిటీ

మళ్లీ మోస్ట్ హ్యాపెనింగ్స్ తో బిజీబిజీగా మారిపోయిన సిటీ

హైదరాబాద్, వెలుగు: సిటీ మళ్లీ మోస్ట్ హ్యాపెనింగ్స్ తో బిజీబిజీగా మారిపోయింది.  మామూలుగానే కెఫేలు,  పబ్‌లు, కల్చరల్​సెంటర్లలో  మ్యూజిక్ నైట్స్ జరుగుతుంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు లైవ్​ మ్యూజిక్​కు డిమాండ్​ పెరిగింది. ఆడియెన్స్​ అంతా లైవ్​ మ్యూజిక్​ను ఎంజాయ్​ చేయడానికి ఇష్టపడుతున్నారు.  లైవ్​ బ్యాండ్​, లైవ్​  కంసెర్ట్​, లైవ్​ మ్యూజిక్​ వంటి ఈవెంట్లు సిటీలో చాలానే జరుగుతున్నాయి.  దీంతో సిటీలో మునుపటితో పోలిస్తే ప్రస్తుతం ఈ తరహా లైవ్ బ్యాండ్‌లు డబుల్ అయ్యాయి. ఈ ప్రొఫెషన్ లోకి వస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగాలు చేస్తూనే పార్ట్‌ టైమ్ గా మ్యూజిక్ మీద తమకున్న ప్యాషన్ ను కొనసాగిస్తున్న వారున్నారు. సిటీలోని అనేక చోట్ల రికార్డెడ్ మ్యూజిక్ కంటే కూడా లైవ్ బాండ్‌లనే కస్టమర్లు ఎక్కువగా కోరుకుంటున్నారు. దీంతో ఆయా ఓనర్లు కూడా వీక్ డేస్‌తో పాటు వీకెండ్స్‌లోనూ లైవ్ బ్యాండ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. ఈవెంట్ స్పాట్లలో రొటీన్ కి భిన్నంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓనర్లు లైవ్ మ్యూజిక్‌ లను పెట్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నలుగురైదురు గ్రూప్‌లుగా మారి ఓల్డ్, హిట్ మెలోడిస్ ని పాడుతూ సెషన్లు నిర్వహిస్తున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్‌తోపాటు ఆల్ టైం హిట్ పాటలను లైవ్ లో పాడుతూ కస్టమర్లను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ లు పెట్టడం వల్ల కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతుందని ఓనర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పెడుతున్న కెఫేలలో కూడా వీటిని పెడుతున్నారు. 

ఉద్యోగాలు చేస్తూ..

సిటీలో ప్రస్తుతం 50కి పైగా లైవ్ మ్యూజిక్ బ్యాండ్‌లు ఉన్నాయి. వీటిలో వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేస్తూ సాయంత్రం  తమ ప్యాషన్ ను కొనసాగిస్తున్నారు. నలుగురైదుగురు గ్రూప్‌గా ఏర్పడి బ్యాండ్ లను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం వీరు సోషల్ మీడియాలో తమ గ్రూప్‌ పేరుతో పేజీలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈవెంట్​కు ముందు ప్రాక్టీస్ చేయడంతో పాటు, పదుల సంఖ్యలో పాటలను లిస్ట్ అవుట్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తారు. ఇది వరకు వీకెండ్స్ తో మాత్రమే జరిగే ఈ లైవ్ బ్యాండ్‌ సెషన్లు ఇప్పుడు వారం మొత్తం నిర్వహిస్తున్నారు. వీరు ఒకచోట మాత్రమే కాకుండా రోజుకో చోట పాడుతున్నారు.  ఒక్కో సెషన్ మూడు నుంచి నాలుగు గంటలు ఉంటుంది. ఇందులో అన్ని రకాల పాటలను పాడి వచ్చిన వారిని ఎంటర్ టైన్ చేస్తుంటామని, ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్ ని కూడా పాడుతుంటామని లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ల మెంబర్లు చెప్తున్నారు. వీళ్లకు ప్రతిరోజు బుకింగ్స్ వస్తూనే ఉంటున్నాయి. దీంతో ఈ ప్రొఫెషన్ కి రావాలని అనుకుంటున్నవారు కూడా పెరుగుతున్నారు. 

సెప్టెంబర్ బాయ్స్ పేరుతో..

నేను నా ఫ్రెండ్స్ ఐదుగురం కలిసి సెప్టెంబర్ బాయ్స్ పేరుతో లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ను 2018 లో ఏర్పాటు చేశాం. ఉద్యోగాలు చేస్తూనే మ్యూజిక్ పై మాకున్న ఇంట్రెస్ట్ ను కంటిన్యూ చేస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా, మా లైవ్ మ్యూజిక్ సెషన్‌ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల ద్వారా బుకింగ్స్ వస్తుంటాయి. కెఫేలు, బిస్ట్రోలతో పాటు ఈవెంట్ మేనేజర్ల ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్​లో కూడా లైవ్ సింగింగ్ చేస్తున్నాం.  

– శరత్, గిటారిస్ట్

లైవ్ మ్యూజిక్ సెషన్లు...

ఈవెంట్లు, పబ్ లలో ఎక్కువగా లైవ్ మ్యూజిక్ బ్యాండ్ లే నడుస్తున్నాయి.  సిటీ వ్యాప్తంగా మా టీమ్ లో 200 మంది ఉన్నారు. మేం లైవ్ షోలు, స్టాండ్ అప్, ఫ్లాష్ మాబ్, డ్యాన్స్ ఈవెంట్స్ చేస్తున్నాం. మ్యూజిక్ బ్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాం. సింగింగ్ తో పాటు గిటార్, ఇతర ఇన్ స్ట్రమెంట్స్ ను నేర్పిస్తున్నాం. 

-  శ్రియ, ఎన్ఆర్ బీ లైవ్ బ్యాండ్