నాలా పనులు ఈసారీ కష్టమే!

నాలా పనులు ఈసారీ కష్టమే!
  •   నెలాఖరుతో ముగియనున్న డెడ్ లైన్
  •   ఎన్నిసార్లు గడువు పొడిగించినా పూర్తికాలే
  •   అనేక అడ్డంకులతో ముందుకు సాగని పనులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో వరదల నివారణకు ఎస్ఎన్డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్​మెంట్ ప్రోగ్రామ్) కింద చేపట్టిన పనుల డెడ్​లైన్ మరోసారి ముగియనుంది. అయినప్పటికీ పనులు మాత్రం పూర్తి కావడంలేదు. ఇప్పటికే మంత్రులు, మేయర్, కమిషనర్ నాలుగైదు సార్లు డెడ్ లైన్ విధించారు. అయినా పనులు పూర్తికాకపోవడంతో ఈ నెల చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్ మరోసారి డెడ్​లైన్ విధించారు. కానీ పనులు ఇప్పటికీ ముగియలేదు. అనేక అడ్డంకులు ఎదురవుతుండటంతో పనులు స్లోగా సాగుతున్నాయి. 

కొన్ని చోట్ల నిర్మాణ దశలోనే..

గ్రేటర్ పరిధిలో రూ.737 కోట్ల 45 లక్షలతో  37 చోట్ల నాలాల  పనులు చేయాలని ప్రతిపాదించినప్పటికీ 35 పనులకు అనుమతులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 8 చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల కొన్ని చివరి దశలో ఉండగా, కొన్ని చోట్ల నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ నెలాఖరులోగా అన్ని నాలాలు అందుబాటు
లోకి వచ్చేలా అధికారులు ప్లాన్ చేసినప్పటికీ.. పలు అడ్డంకులు ఎదురై పనులు ఆలస్యమవుతున్నాయి. మెయిన్ రోడ్లపై నాలా పనులు చేసేందుకు పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోవడం, పనులు చేస్తున్న సమయంలో కరెంట్ కేబుళ్లు, వాటర్, డ్రైనేజీ పైప్​లైన్లు అడ్డు తగులుతుండటంతో స్లోగా సాగుతున్నాయి. వీటిపై కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి అడ్డంకులు తొలగించాల్సిన ఉన్నతాధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

వాటర్, డ్రైనేజీ పైప్​లైన్ల లీకేజీ..

ఎస్ఎన్డీపీ అధికారులు చేస్తున్న నాలాల పనులకు అన్ని చోట్లా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కర్మన్​ఘాట్, రామంతాపూర్, ఎర్రగడ్డ, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నాగోల్, ఎల్​బీనగర్, బండ్లగూడ, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో నాలాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే పనులు జరుగుతున్న సమయంలో కొన్నిచోట్ల వాటర్, డ్రైనేజీ పైప్​లైన్లు లీకేజీ అడ్డంకిగా మారింది. మోటార్లతో ఆ నీటిని తొలగిస్తూనే పనులు చేయాల్సి వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో   కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ 
ఫార్మర్లు అడ్డొస్తుండగా.. అతికష్టం మీద వాటిని తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల గుంతలు తవ్వితే ఇండ్లకు నష్టం కలిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇలా అనేక కారణాల వల్ల పనుల్లో ఆలస్యం జరుగుతోందని​ఎస్ఎన్డీపీ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో పనులు వేగంగా చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. 

మరో 2 నెలలు పట్టే చాన్స్..

వానలు పడినప్పుడే అధికారులు, నేతలు నాలాల పనులపై హడావుడి చేస్తున్నారు. వానలు తగ్గుముఖం పట్టగానే ఆ విషయాన్ని పక్కన పెడుతుండటంతోనే సమస్య ప్రతి ఏటా తీవ్రమవుతోంది. గతంలో వానలు కురిసిన టైమ్​లో నెల రోజులైనా వరదల నుంచి కోలుకోలేని కాలనీలు చాలా ఉన్నాయి. నాలాల వైడెనింగ్, అవసరమున్న చోట కొత్తగా నిర్మాణాలు​ చేపడుతున్నామంటూ రెండేండ్ల కిందట ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ విధంగా పనులు సాగలేదు. నాలాల పూడికతీత సైతం నామమాత్రంగానే జరుగుతోంది. గ్రేటర్​లో మొత్తం నాలాల పనులు పూర్తయ్యేందుకు మరో 2 నెలల టైమ్ పట్టనున్నట్లు అధికారులు