Police Events 2022:క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్

Police Events 2022:క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్

హైదరాబాద్: ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను పోలీస్  రిక్రూట్మెంట్ బోర్డ్  ప్రకటించింది. డిసెంబర్ 8న మొదలైన ఎస్సై, కానిస్టేబుల్  ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ నిన్నటితో (జనవరి 5) ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 12 సెంటర్లలో ఈవెంట్స్ నిర్వహించగా.. 2,07,106 మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. అందులో ఒక 1,11,209 మంది (53.7 శాతం) అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారని పోలీస్  రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.

2018 – 19 లో వచ్చిన నోటిఫికేషన్ లో 48.5 శాతం మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై అవ్వగా,  ఈసారి ఆ సంఖ్య 53.7 శాతానికి పెరిగిందని రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. ఈవెంట్స్ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశామని, గోప్యంగా ఉంచాల్సిన పనిలేదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. అయితే, ఈసారి లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్ కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్లు తెలిపారు. లాంగ్ జంప్ లో 83శాతం పురుషులు, 80 శాతం మంది మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అవగా, షాట్ పుట్ లో 91 శాతం మంది పురుషులు, 96 శాతం మంతి మహిళా అభ్యర్ధులు క్వాలిపై అయ్యారు.