డాల్ఫిన్లను యుద్ధ రంగంలో వాడుతున్న రష్యన్లు

డాల్ఫిన్లను యుద్ధ రంగంలో వాడుతున్న రష్యన్లు

ఒకప్పుడు యుద్ధ రంగంలో ఏనుగులు, గుర్రాలను వాడిన సంగతి మనకు తెలుసు. అయితే వార్ టెక్నాలజీ పూర్తిగా అప్‌‌‌‌డేట్ అయిన తర్వాత వాటి అవసరం లేకుండా పోయింది.  కానీ డాల్ఫిన్ల అవసరం మాత్రం ఇంకా ఉందంటున్నారు రష్యన్లు.  ఇప్పటికీ డాల్ఫిన్లను యుద్ధ రంగంలో వాడుతున్నారు.

ఈ డాల్ఫిన్ల ప్రత్యేకత ఏంటంటే..

సముద్రంలో నీటి అడుగున జరిగే దాడులను ముందుగా గుర్తించేందుకు డాల్ఫిన్ ఆర్మీ ఉపయోగపడుతుంది. ఇటీవల ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా జరుపుతున్న యుద్ధంలో కూడా కొన్ని డాల్ఫిన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దించారు. ఒక్క రష్యానే కాదు అమెరికాకు కూడా డాల్ఫిన్ ఆర్మీ ఉంది. సముద్రంలో జరిగే వార్ ఫేర్‌‌‌‌‌‌‌‌కు డాల్ఫిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అమెరికా నావికా సైన్యం.. నల్ల సముద్రంలోని సెవాస్తోపోల్‌‌‌‌ నౌకాశ్రయంలో రెండు డాల్ఫిన్‌‌‌‌ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది.  డాల్ఫిన్లు ప్రతిధ్వనుల సాయంతో నీటి అడుగున ఉండే వస్తువుల రేడియేషన్స్‌‌‌‌ను స్పష్టంగా గుర్తించగలవు. ఈ సహజ లక్షణం కారణంగా వీటిని యుద్ధంలో వాడుతున్నారు. దాడి కోసం శత్రువులు నీటి అడుగున దాచి ఉంచే ఆయుధాలను డాల్ఫిన్లు వెంటనే పసిగడతాయి. అందుకే డాల్ఫిన్‌‌‌‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు, కెమెరాలు అమర్చి సముద్రం అడుగున పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు.

అమెరికా సైన్యం 1959 నుంచే డాల్ఫిన్‌‌‌‌లు, కాలిఫోర్నియా సీ లయన్‌‌‌‌లకు ఇటువంటి శిక్షణ ఇస్తోంది. దీనికోసం అమెరికా మిలియన్‌‌‌‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. గతంలో కోల్డ్‌‌‌‌వార్‌‌‌‌ సమయంలోనూ అమెరికా, సోవియట్‌‌‌‌ యూనియన్‌‌‌‌లు సముద్రం అడుగున పేలుడు పదార్థాలను గుర్తించేందుకు డాల్ఫిన్లను ఉపయోగించాయి. ఇకపోతే రష్యా కూడా  డాల్ఫిన్లతో పాటు బెలుగా తిమింగలానికి శిక్షణ ఇచ్చి, లక్ష్యాలను గుర్తించడానికి వీలుగా వాటికి కొత్త పరికరాలు అమర్చి పరిశోధనలు చేస్తోంది.   గతంలో  సిరియాతో యుద్ధం సమయంలోనూ రష్యా వీటిని ఉపయోగించి సక్సెస్ అయింది.