మడతపెట్టే టీవీలు..త్వరలో మార్కెట్లోకి..

మడతపెట్టే టీవీలు..త్వరలో మార్కెట్లోకి..

టీవీ ప్రతి ఇంట్లోనూ కామన్​గా ఉండే వస్తువు. బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ హెచ్​డీ టీవీల వరకు రకరకాల టీవీలు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పటిదాకా టేబుల్ మీదో లేదంటే గోడకో వేలాడదీసే టీవీలనే చూశాం. కానీ, ఆస్ట్రియాకు చెందిన సీ సీడ్ ఎంటర్​టైన్ మెంట్ కంపెనీ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఓ డిఫరెంట్ వెర్షన్ టీవీని పరిచయం చేసింది. సీ-సీడ్ ఎం1 పేరుతో 165 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్న టీవీని ప్రవేశపెట్టింది. ఈ టీవీని మడతపెట్టేయొచ్చు.

ఈ టీవీ చాలా స్పెషల్..

ఈ టీవీని ఫోల్డ్ చేసి ఇంట్లో ఓ మూలకు పెట్టుకోవడమే కాదు, అండర్ గ్రౌండ్ లోనూ స్టోర్ చేసుకుని ఒక బటన్ నొక్కగానే బయటికి వచ్చేలా ఫీచర్స్ ను ఏర్పాటు చేశారు. ఇందులో డిస్‌‌‌‌ప్లే ఐదు వేర్వేరు మైక్రో ఎల్ఈడీ ప్యానెల్స్ తో రూపొందించారు. రిమోట్ నొక్కగానే అండర్ గ్రౌండ్ నుంచి నిలువుగా పైకి వచ్చి ఈ ఐదు ప్యానెల్స్ ఒకే ప్యానెల్ గా ఏర్పడతాయని, 165 అంగుళాల భారీ టీవీగా ఏర్పడుతుందని చెప్తున్నారు. మడత టీవీ కదా స్క్రీన్ మీద బొమ్మల మధ్య గ్యాప్ వస్తుందనుకుంటే పొరపాటే. అడాప్టివ్ గ్యాప్ కాలిబ్రేషన్ టెక్నాలజీ ద్వారా ఐదు ప్యానెల్స్ కలిసి సింగిల్ పీస్ టీవీలా కన్పిస్తుందట. అంతేకాదు, ప్రజెంట్ మార్కెట్​లో ఉన్న ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీల కంటే అద్భుతమైన రెజల్యూషన్​తో సూపర్ క్లారిటీ ఇమేజ్ కన్పిస్తుంది. అందుకు ఓఎల్ఈడీకి అడ్వాన్స్ వెర్షన్ అయిన మైక్రో ఎల్ఈడీని ఇందులో ఉపయోగించడమే కారణం.

ఈ ఏడాది చివరలో మార్కెట్​లోకి..

ఇంటీరియర్​ను బట్టి కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు. గోల్డ్, బ్లాక్, టైటానియం తదితర కలర్స్ లో ఈ టీవీని అందుబాటులోకి తెస్తున్నారు. ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్న ఈ ఎం1 టీవీ ధర ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. దీని ధర సుమారు రూ.2.91 కోట్లు. అండర్‌‌గ్రౌండ్ సెట్టింగ్స్ కు , ఇతర ఇన్​స్టాలేషన్ చార్జీలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరిలో ఎం1 టీవీని మార్కెట్​లోకి అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెప్తోంది.