ఏడేండ్ల సంది.. ఇంచు గూడా కదల్లే!

ఏడేండ్ల సంది.. ఇంచు గూడా కదల్లే!

కదలకుండా ఉన్నచోటే ఎక్కువ సేపు ఉండాలంటే మనకే కాదు.. ఏ జంతువుకూ ఓపిక ఉండదేమో. కానీ.. ఏండ్ల సంది ఇంచు కూడా కదలకుండా ఉన్నచోటనే ఉండిపోయే జంతువులు కూడా భూమి మీద ఉన్నాయి. తెల్లటి బల్లిలా ఉన్న ఓల్మ్ అనే ఈ సాలమాండర్ అసొంటిదే! ఇది ఏడేండ్లుగా ఉన్నచోటే ఉందని, కొంచెం కూడా కదలి పక్కకుపోలేదని రీసెర్చర్లు కన్ఫమ్ చేశారు. ఈ సాలమాండర్ లు యూరప్ లోని బోస్నియా గుహల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏకంగా వందేళ్ల వరకూ బతుకుతాయట.

మరిన్ని వార్తల కోసం