మేకల కాపరిపై పులి దాడి.. గొడ్డలితో ఎదురుదాడి

మేకల కాపరిపై పులి దాడి.. గొడ్డలితో ఎదురుదాడి

మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో మేకల కాపరిపై పులి దాడి చేసింది. మేకలను మేపుకుని తిరిగి వస్తుండగా వేమునూరి శంకర్ అనే వృద్ధుడిపై పులి దాడి చేసింది. ఒడ్డుగూడేనికి చెందిన శంకర్ మేకలను తోలుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి.. తిరిగివస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసింది. చేతిలో ఉన్న గొడ్డలితో కొట్టడంతో అది పారిపోయింది. అప్పటికే శంకర్ చేయిపై పులి పంజా విసిరింది. చేతి నుంచి రక్తం కారుతుండగానే అడవి నుంచి గ్రామానికి వెళ్లాడు శంకర్. స్థానికులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. పులి గురించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.