మహాత్మా గాంధీ 72వ వర్ధంతి: నివాళులు అర్పించిన ప్రముఖులు

మహాత్మా గాంధీ 72వ వర్ధంతి: నివాళులు అర్పించిన ప్రముఖులు

గాంధీజీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ MM మనోజ్ ముకుంద్ నరవానె, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ మార్షల్ RKS బదౌరియా నివాళులు అర్పించారు.

ఇటు రాష్ట్రంలో కూడా..  అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు టీఆర్ఎస్ నేతలు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు అధికారులు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుడు గాంధీ అన్నారు నేతలు. దేశానికి గాంధీ చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
పెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం