- మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత భిక్షపతి యాదవ్
హైదరాబాద్: అందినకాడికి దోచుకోవడమే టీఆర్ఎస్ నేతల పని అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్. కూకట్ పల్లి డివిజన్, ఆస్బెస్టాస్ కాలనీలో బిజేపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నుంచి దాదాపు 900 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ ‘బంగారు తెలంగాణ తీసుకొస్తామన్నారు.. 8 ఏండ్లు అయింది.. ఎక్కడపోయింది నీ బంగారు తెలంగాణ.. డబల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తానంటివి.. ఎక్కడున్నాయి డబల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఇంటికో ఉద్యోగం ఇస్తానంటివి.. ఎక్కడిచ్చావు.. నిరుద్యోగ భృతి ఇస్తానంటివి.. ఎక్కడిచ్చావు నిరుద్యోగ భృతి’ అని ప్రశ్నించారు.
బీజేపీ మేడ్చల్ అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీఆర్ఎస్ అంటే.. తాగుడు, అఘాయిత్యాలు, సంపుడు తప్ప ప్రజలకు ఒరిగంది ఏమి లేదని ఆరోపించారు. ప్రధాని మోడీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరుతున్నారని వివరించారు బీజేపీ నేతలు.
