గంజాయి మొక్కలు ఏరేసినట్టు బీజేపీ నేతలను ఏరేస్తం
V6 Velugu Posted on Jan 29, 2022
రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఏరేసినట్టు బీజేపీ నేతలను ఏరేస్తామన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రాష్ట్రంలో గంజాయి ఉండదని.. బండి సంజయ్ ఉండడన్నారు. రైతులను ఎంపీ అర్వింద్ రెచ్చగొట్టడం వల్లే ఆయన్ని రైతులు అడ్డుకున్నారన్నారు.బీజేపీ నాయకులు ఆర్ముర్ రైతులను కలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చుతున్నారన్నారు. రైతులను ఉగ్రవాదులు అనడం బాధాకరమని..అసలైన ఉగ్రవాద సంస్థ బీజేపీనే అని అన్నారు. బీజేపీ నాయకులు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడి వేషం వేసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఆనాడు నిజామాబాద్ ఎర్రజొన్న రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ ఖతం అయిందన్నారు. బుల్లెట్లతో రైతులపై దాడులు చేసిన చంద్రబాబు అడ్రస్ గల్లంతయ్యిందన్నారు. బీజేపీ నేతలు తీవ్రవాదులలెక్క వ్యవహరిస్తున్నారని..తమకు ఆదేశాలు వస్తే బీజేపీ నేతలు రోడ్లపై తిరగలేరన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణను నిలబెట్టేది కేసీఆర్, చెడగొట్టేది బీజేపీ అని అన్నారు. రైతులను ఉగ్రవాదులు అంటే..ఇంకోసారి బండి సంజయ్ నిజామాబాద్ లో అడుగుపెట్టలేడన్నారు.
Tagged Bjp, NIzamabad, Arvind, bandi sanjay, TRS MLA Jeevan Reddy