టీవీ నటుడు అమర్ అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

టీవీ నటుడు అమర్ అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

హైదరాబాద్: కోయిలమ్మ  సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఒక యువతి ఇంటికెళ్లి అమర్ గొడవపడిన విషయం తెలిసిందే. బొటిక్ వ్యవహారంలో అమర్ దాడి చేయడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కూకట్ పల్లి రిమాండ్ కు ఆదేశించడంతో ఇవాళ అమర్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. అమర్ దాడి ఘటన కలకలం రేపింది. మణికొండకు చెందిన ఫ్రెండ్స్ శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీలు బొటిక్ నిర్వహించేవారు. కొన్ని కారణాల వల్ల బొటిక్ వ్యాపారం నుంచి తప్పుకున్న స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు శ్రీవిద్య ఇవ్వలేదు. దాంతో స్వాతి.. కోయిలమ్మ ఫేమ్ సమీర్‌తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లింది. అక్కడ మాటామాటా పెరిగి గొడవ పడ్డారు. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా స్వాతి కూడా శ్రీవిద్యపై అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురి ఫిర్యాదులో స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే ఏం చేయాలంటే..

మా అడవిని అమ్మనీయం

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విపత్తులు

పుస్తకాల్లో భాష మారాలె