ఇవాళ బలపరీక్ష..రేపు సీఎంగా ప్రమాణం

ఇవాళ బలపరీక్ష..రేపు సీఎంగా ప్రమాణం

ముంబై:మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వం లోని ‘మహా వికాస్ అగాధి’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మంగళవారం ముంబైలోని ట్రైడెంట్ హోటల్ లో సమావేశమైన మూడు పార్టీల  ఎమ్మెల్యేలు.. కూటమి నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మేరకు పార్టీల వారిగా ఎమ్మెల్యేలు తీర్మానాలపై సంతకాలు చేశారు. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ ఎల్పీ నేతగా ఎన్ని కైన జయంత్ పాటిల్ .. కూటమి చీఫ్ గా ఉద్ధవ్ పేరును ప్రతిపాదిం చగా, సీఎల్పీ నేత బాలాసాహెబ్ థోరాట్ సమర్థించారు. కోలాహలం నడుమ మీడియా ముందుకు వచ్చిన మూడు పార్టీల నేతలు.. ఉద్ధవ్ ను సీఎం కేడిడేట్ గా అధికారికంగా ప్రకటించారు.

గవర్నర్ తో ఉద్ధవ్ , ఇతర నేతల భేటీ

జాయింట్ ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే.. నేతలందరూ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. ఉద్ధవ్ ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లెటర్లను గవర్నర్ కు అందజేశారు. వీలైనంత తొందరగా ప్రభుత్వాన్ని ఏర్పా టు ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా కాబోయేసీఎం థాక్రేకు గవర్నర్ సూచిం చారు. బుధవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిసేపటికే సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో ఇవాళ్టి అసెంబ్లీ సమావేశం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలతో ముగిసే అవకాశముంది.

గురువారం సాయంత్రం 6.40 కి ముంబైలోని శివాజీ పార్క్​లో ఉద్ధవ్ ఠాక్రేతో సీఎంగా గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ట్రైడెంట్ హోటల్ లో జరిగిన మూడు పార్టీల మీటిం గ్ లో కాబోయే సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య రష్మీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎన్సీపీ ఎంపీ, పవార్ తనయ సుప్రియా సూలే.. రష్మీని వెంటతీసుకెళ్లి పార్టీ నేతల్ని పరిచయం చేశారు. బీజేపీ కూటమి నుంచి శివసేన వేరుపడిన తర్వాత కొడుకు ఆదిత్య థాక్రేను సీఎం చేయాలని రష్మీ పట్టు పట్టినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడామె భర్తే సీఎం కాబోతుండటం ఆమె హ్యాపీగా ఫీలయ్యారు.