డిస్టెన్స్ లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్స్

డిస్టెన్స్ లో  ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్స్

హైదరాబాద్​, వెలుగు: డిస్టెన్స్​లో డిగ్రీ, పీజీ చదవాలనుకునే వారికి యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ ఓ మంచి వార్త చెప్పింది. ఏటా రెండుసార్లు అడ్మిషన్లు విడుదల చేసేందుకు యూనివర్సిటీలకు అనుమతిచ్చింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆదివారం డిస్టెన్స్​ అడ్మిషన్లకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది.   మొదటి విడత అడ్మిషన్లను జులై 1 నుంచి 30 వరకు, రెండో విడత జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించనున్నట్టు ఓయూ ప్రకటించింది. అప్లై చేసుకోవాలనుకునే వాళ్లు www.oucde.net లో దరఖాస్తును పొందవచ్చు. ఎంచుకున్న కోర్సుల్లోనే స్టూడెంట్లు చేరాల్సి ఉంటుంది. ఫీజు, అడ్మిషన్ల ప్రక్రియను ఆన్​లైన్​లో తెలుసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు వర్సిటీలకూ కొంతమేర ఆర్థికంగా కలిసి వస్తుందని, నిధుల సమస్య తీరుతుందని ఓయూలోని జి. రామ్​రెడ్డి సెంటర్​ ఫర్​ డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ ప్రొఫెసర్​ సి. గణేశ్​ అన్నారు.

అడ్మిషన్లు అందించే కోర్సులు

అండర్​ గ్రాడ్యుయేట్​ కోర్సుల్లో నాలుగు, పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సుల్లో రెండు విభాగాలుగా అడ్మిషన్లను నిర్వహించనున్నారు. అదే విధంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి పీజీ డిప్లొమా కోర్సులకూ అడ్మిషన్లు నిర్వహిస్తారు.

అండర్​ గ్రాడ్యుయేట్​ కోర్సులు: బీఏ, బీకాం, బీబీఏ, బీఈడీ

పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, ఉర్దూ, సంస్కృతం), ఎంఏ (ఫిలాసఫీ, ఎకానమీ, పొలిటికల్​ సైన్స్​, పబ్లిక్​ పర్సనల్​ మేనేజ్​మెంట్​, పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, హిస్టరీ, సైకాలజీ), ఎంకాం, ఎమ్మెస్సీ(మ్యాథ్స్​), ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్​)

పీజీ డిప్లోమా కోర్సులు: మ్యాథ్స్​, బిజినెస్​మేనేజ్​మెంట్​, ఇంగ్లీష్​ లాంగ్వేజ్​ టీచింగ్​, కంప్యూటర్​ అప్లికేషన్స్​, బయో ఇన్ఫర్మాటిక్స్​