స్టాక్ మార్కెట్పై కొనసాగుతున్న ఉక్రెయిన్ ప్రభావం

స్టాక్ మార్కెట్పై కొనసాగుతున్న ఉక్రెయిన్ ప్రభావం

దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రభావం.. దేశీయ స్టాక్ సూచీలపైన ఇంకా కొనసాగుతోంది. యుద్ధం వల్ల చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు 3 శాతానికి పెరిగాయి.  సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, ఎన్ టీపీసీ, రిలయన్స్ లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపాలో ప్రధాన మార్కెట్లైన యూకే, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు భారీగా నష్టపోయాయి. ఆసియా- పసిఫిక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ పతనమయ్యింది.