గుల్జార్, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్ అవార్డు

గుల్జార్, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్ అవార్డు

న్యూఢిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు 2023 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం  ప్రకటన విడుదల చేసింది. గుల్జార్ గా ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కల్రా (89) హిందీ సినిమాల్లో పాటల రచయితగా, డైరెక్టర్ గా  పనిచేస్తున్నారు. పలు పుస్తకాలనూ రాశారు. ఆయన 2002లో సాహిత్య అకాడమీ, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే, 2004లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. రామభద్రాచార్య (74) మధ్యప్రదేశ్ చిత్రకూట్ లోని తులసీ పీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతిగా ఉన్నారు. ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవాది, విద్యావేత్తగా పేరుపొందారు. 240కుపైగా పుస్తకాలు రాశారు. 22 భాషల్లో ప్రావీణ్యులు. సంస్కృతం, హిందీ, అవధి, మైథిలీ సహా అనేక భాషల్లో రచనలు చేశారు.