బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలు వినియోగించుకోవాలి: విజయ్ కుమార్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలు వినియోగించుకోవాలి:  విజయ్ కుమార్

హైదరాబాద్, వెలుగు:  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణలోని బ్రాంచ్‌‌‌‌ల ద్వారా  సేవలను వినియోగించుకోవడానికి  రాష్ట్రంలోని వివిధ కీలక శాఖలు, వాటాదారులతో వ్యూహాత్మక సమావేశాలను నిర్వహిస్తోంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ఏబీ విజయ్‌‌‌‌కుమార్ ఈ కీలక శాఖలకు నాయకత్వం వహిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నతాధికారులతో వ్యూహాత్మక సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో జోనల్ మేనేజర్ సుశాంత్ గుప్తా  హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్‌‌‌‌తో పాటు బ్యాంక్ బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ఇటీవల ప్రకటించిన 3 నెలల- ఫలితాల్లో బ్యాంక్ పనితీరును  విజయకుమార్ వివరించారు.ఈ ఆర్థిక ఏడాది3 నెలల్లోనే  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  రూ. 4.20 ట్రిలియన్ల వ్యాపారాన్ని అధిగమించిందని, ఇది బ్యాంక్ ప్రయాణంలో గుర్తించదగ్గ విషయమన్నారు. 

దేశ జీడీపీకి ప్రధాన సహకారంలో తెలంగాణ ఒకటి కావడం గొప్ప విషయమన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వ్యాపార విస్తరణ ప్రణాళిక ముందంజలో ఉందని, ఇక్కడ ఉత్తమ సేవలను అందిస్తూ  వ్యాపార అవకాశాలను నిరంతరం ఉపయోగించుకుంటామమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్​లు 54 ఉన్నాయని, రూ. 12వేల కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను బలోపేతం చేయడానికి మరో 7 బ్రాంచ్ లను తెరిచే ఆలోచనలో ఉన్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.