Vijay thalapathy: విడాకులు ఇవ్వనున్న విజయ్.!

Vijay thalapathy: విడాకులు ఇవ్వనున్న విజయ్.!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ విడాకులు ఇవ్వనున్నట్లు తమిళ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. విజయ్, ఆయన భార్య సంగీతకు మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయని వారిద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారని మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నారు. సంగీత విజయ్ కు వీరాభిమాని. 22 ఏళ్ల క్రితం వారిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట విడిపోనుందంటూ వస్తున్న వార్తలతో విజయ్ ఫ్యాన్స్ షాకయ్యారు.

వారీసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంగీత రాకపోవడం, డైరెక్టర్ ఆట్లీ భార్య సీమంతం వేడుకలో విజయ్ ఒక్కడే కనిపించాడు. ఇలా గత కొన్ని రోజులుగా విజయ్, సంగీతలు ఏ ఈవెంట్ లోనూ జంటగా కనిపించకపోవడం విడాకుల ఊహాగానాలకు కారణమయ్యాయి. అయితే విజయ్ సన్నిహితులు మాత్రం డైవర్స్ రూమర్స్ ను కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత పిల్లలతో కలిసి అమెరికాలో ఉందని హాలీడేస్ ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు. ఆమె ఈవెంట్స్ కు రాకపోవడానికి కారణమని చెబుతున్నారు. వారిసు రిలీజ్ అనంతరం విజయ్ కూడా యూఎస్ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విజయ్ తాజా చిత్రం వారసుడు విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కానుండగా.. తలపతి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.