సూర్యకుమార్ ఔట్ పై సెహ్వాగ్ సెటైర్

సూర్యకుమార్ ఔట్ పై  సెహ్వాగ్ సెటైర్

భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫోర్త్ టీ20లో సూర్యకుమార్ ఔట్ వివాదాస్పదంగా మారుతోంది.  థర్డ్ ఎంపైర్ ఔట్ ఇవ్వడాన్ని మాజీలు ఆటగాళ్లు తప్పుబడుతున్నారు. టీం ఇండియా ఇన్నింగ్స్ లో 13.2 ఓవర్లో మంచి జోరుమీదున్న సూర్యకుమార్ యాదవ్.. సామ్ కరన్ వేసిన బాల్ ను గాల్లోకి లేపాడు. అది మలన్ క్యాచ్ పట్టాడు. అయితే బాల్ నేలను తాకినట్టు కనిపిస్తుంది. కానీ థర్డ్ ఎంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔట్ కే మొగ్గు చూపి ఔటిచ్చాడు. నేలకు తాకినట్టు స్పష్టం కనిపించినా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, లక్ష్మణ్ తప్పుబట్టారు.

సూర్య ఔటయిన ఫోటో షేర్ చేసి ఇదేలా? ఔట్ అని ట్విట్టర్లో ప్రశ్నించాడు  లక్ష్మణ్. థర్డ్ ఎంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని ఔటివ్వడమేంటి అని అన్నాడు. సూర్య ఔట్ విషయంలో అంపైర్ కళ్లు మూసుకుని ఔటిచ్చాడంటూ సీరియస్ అయ్యాడు సెహ్వాగ్. ఈ మ్యాచ్ లో భారత్  ఇంగ్లాండ్ పై 8 వికెట్లతో తేడాతో గెలిచింది.