విశ్వహిందూ మహాసభ నేత దారుణ హత్య

విశ్వహిందూ మహాసభ నేత దారుణ హత్య

విశ్వ హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ యూనిట్​ చీఫ్ రంజిత్ బచ్చన్(40) దారుణహత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేసే సమయంలో ఓ దుం డగుడు రంజిత్ పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆదివారం ఉదయం లక్నోలోని హజ్ రత్ గంజ్ ఏరియాలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో రంజిత్ సోదరుడు ఆదిత్య శ్రీవాస్తవ గాయపడినట్టు లక్నో జాయింట్​ కమిషనర్ ఆఫ్ పోలీస్ నవీన్ అరోరా చెప్పారు. రంజిత్, ఆదిత్య మొబైల్ ఫోన్లను దుండగుడు అపహరించారన్నారు. మార్నింగ్ వాక్ కోసం ఓసీఆర్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన తమను గ్లోబ్​ పార్క్​ దగ్గర శాలువా కప్పుకున్న ఓ వ్యక్తి ఆపాడని, తమ నుంచి ఫోన్లు లాక్కుని.. ఆ తర్వాత కాల్పులు జరిపాడని ఆదిత్య చెప్పినట్టు అరోరా వెల్లడించారు. గోరఖ్ పూర్ కు చెందిన రంజిత్ ..చాలా కాలం సమాజ్ వాదీ పార్టీతో కలిసి పనిచేశారు. 2002–09 వరకు ఆ పార్టీ తరఫున సైకిల్ ర్యాలీలు చేశారు. ఈ కేస్ ను సాల్వ్​ చేసేందుకు క్రైం బ్రాంచ్ కు చెందిన ఎనిమిది టీమ్​లను రంగంలోకి దించామని ఆరోరా చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక ఎస్ఐ సహా నలుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.