బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం: ప్రొఫెసర్​ కోదండరామ్​

బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం: ప్రొఫెసర్​ కోదండరామ్​

మంచిర్యాల, వెలుగు: దేశంలో బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ జన సమితి చైర్మన్​ప్రొఫెసర్ కోదండరామ్​ అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని చార్వాక ట్రస్ట్​భవన్​లో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం – పార్లమెంట్​ఎన్నికలు – మన కర్తవ్యం’ అంశంపై ప్రజా సంఘాల నాయకులతో కలిసి సదస్సు నిర్వహించారు. 

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ ​మాట్లాడుతూ... భారత రాజ్యాంగం పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛను, సమాన అవకాశాలను కల్పించిందన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు. కానీ, బీజేపీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందన్నారు. ఆ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ మార్పు తప్పదన్నారు. దీనివల్ల పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని, ఇది దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. 

రాజకీయ లబ్ధి కోసం కులం, మతం పేరుతో చిచ్చు పెడుతున్న బీజేపీ చర్యలను ఈ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియంతృత్వ బీఆర్ఎస్​ను ఓడించినట్టే పార్లమెంట్​ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి మతతత్వ బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. టీజేఎస్​స్టేట్​ఆర్గనైజింగ్​సెక్రటరీ బాబన్న, నాయకులు రాంచంద్రారెడ్డి, బచ్చలి ప్రవీణ్​కుమార్, గొడిసెల శ్రీనివాస్, సీనియర్​ జర్నలిస్టు ఎండీ.మునీర్​, కాంగ్రెస్​లీడర్లు కె.రవి, శ్యాంసుందర్​రెడ్డి, జైపాల్​సింగ్, సత్యం పాల్గొన్నారు.