కేంద్రంలో కాంగ్రెస్​ వచ్చాక..రోహిత్ వేముల చట్టం తెస్తం : కేసీ వేణుగోపాల్

కేంద్రంలో కాంగ్రెస్​ వచ్చాక..రోహిత్ వేముల చట్టం తెస్తం : కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన ఏ విద్యార్థి.. యూనివర్సిటీల్లో రోహిత్ వేముల వంటి దుస్థితిని ఎదుర్కొనకుండా రోహిత్ వేముల చట్టాన్ని తెస్తామని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ చట్టంతో క్యాంపస్ లలో కుల, మత దౌర్జన్యాలు, వివక్షను రూపు మాపేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాజాగా రోహిత్ ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసుల రిపోర్ట్ పై నెలకొన్న వివాదంపై ఆదివారం ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. 

రోహిత్ వేముల మరణం బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని బట్టబయలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ తోనే రోహిత్ కుటుంబానికి న్యాయం జరుగు తుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో రోహిత్ కుటుంబానికి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అండగా నిలిచిందని గుర్తు చేశారు. గతంలో నిర్వహించిన దర్యాప్తు లో అనేక అవకత వకలు జరిగాయని ఆరోపించారు. కేసు రిపోర్ట్ ను 2023 లో జూన్ లో సిద్ధం చేసినట్లు పోలీసులు తెలి పారన్నారు. అయితే... రోహిత్ కుటుంబా ని కి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.