గ్రీన్ టీ చూశాం, లెమన్ టీ చూశాం.. ఈ ఉప్పు- మిరప చాయ్ ఏంటా అనే సందేహం రావడం కామన్. ఎందుకంటే ఈ కాంబినేషన్ అలాంటిది మరి. ఇండియన్స్ కు చాయ్ తాగే అలవాటులో ఎన్నో రకాలా టీ లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక్కో స్టేట్ లో ఒక్కో టీ ఫేమస్. కామన్ గా టీ అంటే ఇండియన్స్ ఇష్టమైనప్పటికీ.. అక్కడక్కడా.. వెరైటీ చాయ్ లు దర్శనమిస్తుంటాయి. సోషల్ మీడియా కారణంగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సాల్ట్, చిల్లీ చాయ్ కూడా అలాగే వైరల్ అవుతోంది.
సాల్ట్, చిల్లీ.. అదే ఉప్పు, మిరపకాయ్ చాయ్.. త్రిపురలో ఫేమస్. ముఖ్యంగా ట్రైబల్ కమ్యూనిటీలు సంప్రదాయంగా ఈ స్పెషల్ టీ తాగుతుంటారు. చక్కెర, పాలతో చేసిన టీ కారణంగా వస్తున్న సమస్యల నుంచి దూరం ఉండేందుకు, త్రిపుర లాంటి పర్వత ప్రాంతాల్లో పాల కొరతను అధిగమించేందుకు వాళ్లు సాల్ట్-చిల్లీ(salt and chilli) చాయ్ ను వినియోగిస్తారు.
సాల్ట్ చిల్లీ టీ తయారు చేయడం ఎలా..?
ఈ చాయ్ ను తయారు చేయడం చాలా సింపుల్ అంటున్నారు త్రిపుర వాసులు.
కావాల్సినవి:
- 1½ కప్పుల నీరు
- 1 లేదా 1½ టీస్పూన్లు బ్లాక్ టీ ఆకులు (అస్సాం టీ అయితే బెటర్)
- 1 చిన్న పచ్చి మిరపకాయ, ముక్కలుగా కోసి లేదా దంచాలి
- ½ టీస్పూన్ ఉప్పు, రుచికి సరిపడా
- ½ ఇంచ్ అల్లం (ఆప్షనల్)
ఉప్పు-మిరప చాయ్.. సాల్టీగా, లైట్ కారంగా.. పాలతో చేసిన చాయ్ తో పోల్చితే డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఇది త్రిపురలోనే కాదు.. ఇండియాలో చాలా ఏరియాల్లో వాడుతున్నారు. చల్లని ప్రదేశాలలో.. కోల్డ్ క్లైమేట్స్ లో ఉండే వారికి చాలా బాగుంటుందని చెబుతున్నారు.
