మీ పిల్లల్ని అర్ధరాత్రి వరకూ నిద్రపుచ్చడం లేదా..? అయితే ఈ సమస్యలు తప్పవంటా..!

మీ పిల్లల్ని అర్ధరాత్రి వరకూ నిద్రపుచ్చడం లేదా..? అయితే ఈ సమస్యలు తప్పవంటా..!

పెద్దవాళ్లతోపాటు పిల్లలు కూడా అర్ధరాత్రి వరకూ మేల్కొంటుంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యం పాడవటమే కాదు స్థూలకాయం కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. పిల్లలు ఇంటి పనులకు అడ్డువస్తున్నారని వారిని టీవీకి ఫోన్లకు అలవాటు చేయకండి. అలా చేయడం వల్ల వాళ్లు వాటికి అలవాటు పడిపోతారు.

రాత్రుళ్లు తొందరగా పడుకునేందుకు ఒప్పుకోరు. కాబట్టి టీవీ, ఫోన్లు చూసేందుకు కచ్చితమైన సమయాన్ని నిర్ణయించండి. నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందే వాటికి దూరంగా ఉండేలా చేయండి. మీ పనులు పూర్తికాలేదని అర్ధరాత్రి వరకూ పిల్లల్ని మెలకువగా ఉంచకండి. మీకు పనులెన్ని ఉన్నా వారు వేళకు నిద్రపోయేలా చూడండి. 

లేదంటే వాళ్లు ఉదయాన్నే నిద్రలేవలేరు. ఆ ప్రభావం వాళ్ల చదువుపై పడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అలసిపోయి, చురుకుదనం కూడా తగ్గుతుంది. ఒక్కోసారి పిల్లలు తీసుకునే ఆహారం కూడా నిద్రలేమికి కారణం కావొచ్చు. రాత్రి పూట ఘనపదార్ధాలు మసాలా వంటకాలు మంచివి కావు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని వారికి పెట్టండి. అప్పుడు మెదడుని తేలికపరిచే ఎండార్ఫిన్లు విడుదలై వారు హాయిగా పడుకుంటారు.