సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మూవీ టీమ్ కృతఙ్ఞతలు తెలియజేసింది. విశ్వక్సేన్, కయాదు లోహర్ జంటగా అనుదీప్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పిన మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోందని విశ్వక్సేన్ అన్నాడు. రెస్పాన్స్ పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. హీరోయిన్ కయాదు, దర్శకుడు అనుదీప్ పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.
