విశ్వక్‌సేన్, కయాదు లోహర్ జంటగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ రూపొందించిన చిత్రం ‘ఫంకీ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ ‘నా గత చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా.. ఈ మూవీ ప్రతి ఒక్కర్నీ అలరిస్తుందని నమ్ముతున్నా.
ప్రేక్షకులకు రెండు గంటల సమయం ఎలా గడిచిందో కూడా తెలియనంతగా వినోదాన్ని పంచుతాం’ అని అన్నాడు. తన కెరీర్‌లో ఫస్ట్ కామెడీ మూవీ ఇదని కయాదు లోహర్ చెప్పింది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని దర్శకుడు అనుదీప్ అన్నాడు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఇది క్యూట్ కామెడీ ఫిల్మ్. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో.. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ. ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
