ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బన్సీలాల్​పేటలో ఇటీవల పునరుద్ధరించిన మెట్లబావి(నాగన్నకుంట)కి సందర్శకులు పెరిగారు. సిటీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చారిత్రక కట్టడాన్ని చూసి వెళ్తున్నారు. రాత్రిళ్లు స్పెషల్​ లైటింగ్ మధ్య మెట్లబావి మెరిసిపోతోంది. బావి లోపల, యాంఫీ థియేటర్, ఫొటో గ్యాలరీ వద్ద సందర్శకులు ఫొటోలు దిగుతూ ఎంజాయ్​ చేస్తున్నారు. సోమవారం మినహా మిగిలిన అన్నిరోజులు సందర్శకులను అనుమతిస్తున్నారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్లబావి ఓపెన్ ఉంటోంది. గండిపేట వెల్ఫేర్​సొసైటీ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. రూ.50 ఎంట్రీ టికెట్​ పెట్టారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

-  వెలుగు ,పద్మారావునగర్

సికింద్రాబాద్​ జోనల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యూనియన్ నేతల వినతి  

పద్మారావునగర్, వెలుగు:  బల్దియా సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కారించాలని కోరుతూ గ్రేటర్​ హైదరాబాద్ ​బీజేపీ మజ్దూర్​ మోర్చా సెల్​అధ్యక్షుడు ఊదరి గోపాల్, సికింద్రాబాద్ ​జోన్​ఎంప్లాయీస్ ​యూనియన్ ​ప్రెసిడెంట్ జోగు రాకేశ్​కుమార్​ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్​రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బల్దియా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే  భవిష్యత్ కార్యాచరణను తొందరలోనే ప్రకటిస్తామని  పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్​ యూనియన్ బాధ్యులు కృష్ణ, బి.నర్సింగ్​రావు తదితరులు పాల్గొన్నారు. 

‘పైగా’ టూంబ్స్ పరిరక్షణకు యూఎస్ కాన్సులేట్ ఆర్థిక సాయం

రూ. 2 కోట్ల 55 లక్షలతో పునరుద్ధరణ పనులు

హైదరాబాద్, వెలుగు : సంతోష్​నగర్​లోని  ‘పైగా’ టూంబ్స్ పరిరక్షణకు ఆర్థిక సాయం చేస్తామని యూఎస్ కాన్సులేట్ జెన్నిఫర్ లార్సన్, యూఎస్ రాయబారి ఎలిజిబెత్ జోన్స్ వెల్లడించారు. మంగళవారం వారిద్దరూ ‘పైగా’ టూంబ్స్ కాంప్లెక్స్​ను సందర్శించారు. అనంతరం యూఎస్ అంబాసిడర్స్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ (ఏఎఫ్​సీపీ) నిధులతో టూంబ్స్ పరిరక్షణ ప్రాజెక్ట్ చేపడతామని ప్రకటించారు. ఏఎఫ్​సీపీ ద్వారా 18,19వ శతాబ్దంలో నిర్మించిన ఆరు టూంబ్స్ పునరుద్ధరణ కోసం రూ.2 కోట్ల 55 లక్షలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఎలిజిబెత్ జోన్స్ మాట్లాడుతూ..  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యూఎస్ కాన్సులేట్ ద్వారా నిధులు సమకూర్చిన ఐదో పరిరక్షణ ప్రాజెక్ట్  ‘పైగా’ టూంబ్స్ అని తెలిపారు. స్మారక చిహ్నాలను కాపాడటం కోసం రాష్ట్ర సర్కార్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాబోయే తరాలకు  చారిత్రక ప్రదేశాలను అందించగలుగుతున్నామని యూఎస్ కాన్సులేట్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. యూఎస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ స్టేట్ 2001లో ఏఎఫ్​సీపీని ప్రారంభించిందని.. దాని ద్వారా అమెరికన్ విలువలను, ఇతర సంస్కృతులను కాపాడుతున్నామని తెలిపారు. ఏఎఫ్​సీపీ ఇప్పటిదాకా ప్రపంచంలోని 133 దేశాల్లో 1,100 కంటే ఎక్కువ ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని అందించిందని తెలిపారు. ఈ సందర్శనలో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రతీశ్ నందా పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్యలు నివారించకపోవడం సిగ్గుచేటు

ముషీరాబాద్, వెలుగు: రైతు ఆత్మహత్యలను నివారించకపోవడం సిగ్గుచేటని రైతు ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ మరిగంటి యాదగిరిచార్యులు విమర్శించారు. రాష్ట్రం వచ్చాక సుమారు 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలే లేవంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వీటిని పాలకులు చేసిన హత్యలుగానే చూడాలన్నారు. మంగళవారం అఖిల భారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వ వైఖరి, మన కర్తవ్యం’ అనే అంశంపై బాగ్ లింగంపల్లిలో ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య అధ్యక్షతన జరిగిన రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు మారినా విధానాలు మారకపోవడంతో ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. దీంతో ప్రైవేటు పెట్టుబడులతో పంటలు పండించిన రైతులకు మద్దతు ధర లభించక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందులో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారన్నారు. కౌలు రైతులను గుర్తించాలని, పంటలకు మద్దతు ధర కల్పించాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి 31 వరకు జిల్లా కేంద్రాల్లో రైతు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. 

కంటి సమస్యలు లేని తెలంగాణే లక్ష్యం

సమీక్ష సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్

సికింద్రాబాద్​, వెలుగు: అంధులు లేని తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 18 నుంచి జూన్​30 వరకు నిర్వహించే ‘కంటి వెలుగు’ రెండో విడత నిర్వహణపై జీహెచ్ఎంసీ ఆఫీసులో మంగళవారం మంత్రి మహమూద్​అలీతో కలిసి జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేస్తోందని తలసాని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 91 వార్డుల్లో 115 క్యాంప్ లను నిర్వహించనున్నామని.. వాటి ఏర్పాటుకు కమిటీ హాల్స్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ గ్రౌండ్​లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.  క్యాంప్​ల వద్ద   ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైనవారికి కంటి ఆపరేషన్లు చేయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్,   కలెక్టర్ అమోయ్ కుమార్, బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్, వైద్యాధికారులు  పాల్గొన్నారు.