వారెన్ బఫెట్ కు 50 బిలియన్ డాలర్ల లాస్

వారెన్ బఫెట్ కు 50 బిలియన్ డాలర్ల లాస్
  • కరోనా ఎఫెక్ట్ తో కంపెనీ చరిత్రలోనే రికార్డు నష్టం

న్యూయార్క్ : ప్రఖ్యాత స్టాక్ ఇన్వెస్టర్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ లో ఒకరైన వారెన్ బఫెట్ ను కరోనా ముంచేసింది. దీని ధాటికి ఆయన కంపెనీ బెర్క్‌షైర్‌ హాత్‌వే భారీగా పతనమైంది. దీంతో రికార్డు స్థాయిలో నష్టాలు నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి తో ముగిసిన ఫస్ట్ క్వార్టర్ (అమెరికా లో ఫైనాన్స్ ఇయర్ ను జనవరి నుంచి డిసెంబర్) కు లెక్కిస్తారు. ఫస్ట్ క్వార్టర్ లో ఏకంగా 5 బిలియన్ డాలర్లు లాస్ అయినట్లు కంపెనీ ప్రకటించింది. మన కరెన్సీలో ఈ మొత్తం రూ.3.75 లక్షల కోట్లు. కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉండటంతో వారెన్ బఫెట్ సంస్థలు భారీగా నష్టపోయాయి. కంపెనీ చరిత్రలోనే ఇంతగా నష్టపోవటం ఇదే తొలిసారంటూ సంస్థ ప్రకటించింది. బెర్క్‌షైర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో గీకో ఆటో ఇన్సూరెన్స్‌, బ‌ర్లింగ్టన్ నార్తర్న్ సాంటా ఫీ రెయిల్‌రోడ్‌, డైరీ క్వీన్‌, డూరాసెల్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఈ ఏడాది బెర్క్‌షైర్ షేర్లు సుమారు 20 శాతం ప‌డిపోయాయి. బెర్క్‌షైర్‌కు చెందిన దాదాపు 90 వ్యాపారాలు ఏప్రిల్ నెలలో పైసా ఆదాయాన్ని ఆర్జించ‌లేక‌పోయాయి.