వర్సిటీ వాచ్​మన్ జేఎన్‌యూ సీటు కొట్టిండు

వర్సిటీ వాచ్​మన్ జేఎన్‌యూ సీటు కొట్టిండు

న్యూ ఢిల్లీ: తాను వాచ్ మన్ గా పనిచేస్తున్న వర్సిటీలోనే పీజీ సీటు కొట్టి వాహ్ వా అనిపించాడు ఓ సెక్యూరిటీ గార్డు. చదువుపై ఇష్టంతో డ్యూటీ చేస్తూనే పుస్తకం పట్టాడు. రోజుకు ఆరు గంటలు చదివి ఎంట్రెన్స్ లో అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో సీటు సంపాదించాడు. రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాకు చెందిన రామ్జల్ మీనా(34) భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఢిల్లీలోని మనిర్కాలో ఉంటున్నాడు. సొంతూరులో పన్నెండో తరగతి వరకు చదివిన మీనా.. కుటుంబ పరిస్థితుల కారణంగా తండ్రితో కలిసి కూలీ పనికి కుదిరి.. డిగ్రీ ఫస్టియర్ లోనే చదువు మానేశాడు. కానీ, చదువుకోవాలనే పట్టు వదిలిపెట్టలేదు. జేఎన్‌యూలో 2014 లో సెక్యూరిటీ గార్డుగా చేరడంతో అక్కడి వాతావరణం మీనాను మళ్లీ చదువుల వైపు నడిపించింది. డ్యూటీ చేస్తూనే రష్యన్‌‌ స్టడీస్‌‌పై  దృ ష్టి పెట్టాడు. రష్యన్(ఆనర్స్) ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసిన మీనా.. సివిల్సే తన టార్గెట్ అని అంటున్నాడు. ‘జేఎన్‌యూలో సీటు సంపాదించాలనే పట్టుదలతో రోజుకు ఆరు గంటలు ప్రిపేర్ అయ్యాను. డ్యూటీ టైమ్ లోనూ పేపర్లు, మ్యాగజైన్లు తిరగేసేవాణ్ని. వర్సిటీ స్టూడెంట్ స్టడీ మెటీరియల్ అందించడం ఉపయోగపడింది’ అని చెబుతున్నాడు.