త్వరలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు

త్వరలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు

వేసవి నేపథ్యంలో సిటీలో నీటి వినియోగం పెరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజీ బోర్డు ప్రత్యేక కార్యా చరణ రూపొందించింది. నీటి ఎద్దడి ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్లు నడిపేలా వాటర్ బోర్డు ప్లాన్‍ వేసింది. నీటి ఎద్దడి నివారణపై వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్.. అధికారులతో సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. నీటి కొరతకు చెక్ పెట్టే యాక్షన్ ప్లాన్ , అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే అధికారులకు సూచించారు. ప్రస్తుతం సిటీ నీటి అవసరాల తీర్చేందుకు మంజీరా, సింగూరు, ఎల్లం పల్లి,అక్కంపల్లి, ఉస్మాన్​సా గర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లపై ఆధారపడుతున్నారు. ఇందులో..మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి లభ్యత రోజురోజుకూ పడిపోతోంది. దీంతో మహానగర దాహార్తి తీర్చడంలో ఉస్మాన్​ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు కీలకంగా మారాయి.నీటి శుద్ధి కేంద్రాల కోసం ప్రతిపాదనలు…వేసవి ప్రారంభంలోనే నీటి కొరత ఏర్పడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఆధునిక నీటి శుద్ధి కేంద్రాలను వినియోగించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నగరానికి వచ్చే నీటిని ఈ కేంద్రాల్లో శుద్ధి చేశాక ఇంటిం టికీ నల్లాలు, ట్యాం కర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నగరంలో రాజేంద్రనగర్ ,గచ్చి బౌలి, శేరిలిం గంపల్లి ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య ఉంది. శివారు ప్రాంతాలకూ జలమండలి నుంచే నీటి సరఫరా చేయాల్సి రావడంతో డిమాండ్ కు తగిన సప్లయ్ లేదు. దీంతో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గా లపై నజర్‍….

మంజీరా, సింగూరులలో జలాలు తగ్గిపోవడంతోప్రత్యామ్ నాయ మార్గాలపై దృష్టి పెట్టారు . ఉస్మాన్​ సాగర్ , హిమయత్ సాగర్ లో నీటి లభ్యతకు అనుణంగా నీటిని తరలించి వాటర్ ట్రీట్ మెంట్ చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో సరఫరాచేయాలని భావిస్తున్నారు. ఉస్మాన్​ సాగర్ నుంచి వచ్చే శుద్ధి చేయని నీటిని ఆసిఫ్ నగర్ లోని ట్రీట్ మెంట్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. హిమాయత్ సాగర్ నీటిని మీర్‍ఆలం ప్లాంట్లకు, సింగూరు నీటిని పెద్దపూర్, మంజీర నుంచి వచ్చే నీటిని రాజంపేటకు, అక్కంపెల్లి నుంచి వచ్చే నీటిని కోదండ్లపూర్ , ఎల్లం పల్లి జలాలను గోదావరి వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేస్తున్నారు. వీటికి అదనంగా మరో 4 ట్రీట్ మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా వాటర్ డిమాండ్ ఎక్కు వగా ఉండే గచ్చి బౌలి, శేరిలిం గంపెల్లి పరిసర ప్రాంతాల్లో మొబైల్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

అత్యాధునిక వాటర్​ ట్రీట్ మెం ట్ ప్లాంట్లు….

వాటర్‍ బోర్డు అంచనాల మేరకు నగరంలో 16 వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు అవసరం. ముందుగా నగరంలో 4 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అత్యవసరంగా రెండు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను రంగం సిద్ధమైంది. అధునిక పరిజ్ఞానం సాయంతో పని చేసే వీటిని మణికొండ, పుప్పాలగూడలో వినియోగించనున్నారు. వీటితో 5ఎంఎల్డీ నీటిని శుద్ధి చేయనున్నారు. మిగతా రెండింటిని ఖానాపూర్​, కోకాపేట్ ప్రాంతంలో ప్రారంభించేలా వాటర్‍బోర్డు సన్నాహాలు చేస్తోంది.