డిటాక్స్‌ డ్రింక్‌తో వెయిట్‌ లాస్‌

డిటాక్స్‌ డ్రింక్‌తో వెయిట్‌ లాస్‌

వెయిట్‌‌లాస్‌‌ అవ్వాలనుకునే వాళ్లు హెల్దీ డిటాక్స్ డ్రింక్స్‌‌ తీసుకోవాలి. కిచెన్‌‌లో రెగ్యులర్‌‌‌‌గా ఉండే ఐటమ్స్‌‌తోనే మంచి డిటాక్స్‌‌ డ్రింక్స్‌‌ తయారు చేసుకోవచ్చు. సీజనల్‌‌గా దొరికే ఫ్రూట్స్‌‌, వెజిటబుల్స్‌‌తో వీటిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎవరి టేస్ట్‌‌ను బట్టి, వాళ్లు తయారు చేసుకుని తాగితే మంచి బెనిఫిట్స్‌‌ ఉంటాయి. లెమన్‌‌, ఆరెంజ్‌‌, పుదీనా, కీరా దోస, పైనాపిల్‌‌, అల్లం, తేనెలతో వెరైటీ డ్రింక్స్‌‌  చేసుకోవచ్చు.

ఆరెంజ్‌‌: ఆరెంజ్‌‌లో విటమిన్‌‌–సి పుష్కలం. వీటిలో క్యాలరీలు తక్కువ. యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌‌ ఎక్కువగా ఉండటం వల్ల గాయాలైనప్పుడు వాపుల్ని త్వరగా తగ్గిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్త ప్రసరణ సరిగ్గా ఉండేలా చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌‌‌‌ను పెంచి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఆరెంజ్‌‌ను రోజూ జ్యూస్‌‌ చేసుకుని ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగాలి.

లెమన్‌‌: ప్రతి ఉదయం నిమ్మరసం, తేనె కలిపి తాగితే చాలా మంచిది. నిమ్మలో విటమిన్‌‌–సి అధికంగా ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ, ఇమ్యూనిటీ పవర్‌‌‌‌ పెంచుతుంది. బ్లడ్‌‌ ప్రెజర్‌‌‌‌ను కంట్రోల్‌‌ చేస్తుంది. బాడీకి ఐరన్‌‌ గ్రహించే శక్తిని పెంచడమే కాకుండా, బరువును కూడా తగ్గిస్తుంది.

పైనాపిల్‌‌: పైనాపిల్‌‌లో థయామిన్‌‌, రైబోఫ్లేవిన్‌‌, విటమిన్‌‌ బి–6, ఫోలేట్‌‌, పానోథెనిక్‌‌ యాసిడ్‌‌, పొటాషియం, మెగ్నీషియం వంటి న్యూట్రియెంట్స్‌‌ పైనాపిల్‌‌లో ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగకుండా చూస్తుంది. పైనాపిల్‌‌ జ్యూస్‌‌లో, ఒక నిమ్మచెక్క పిండుకుని తాగితే చాలా మంచిది.

కీరా దోస: వాటర్‌‌‌‌ కంటెంట్‌‌తోపాటు న్యూట్రియెంట్స్‌‌ కూడా ఎక్కువగా ఉండే కీరాదోసతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌‌ ఉన్నాయి. కీరాదోసలో దాదాపు 95 శాతం నీళ్లే ఉంటాయి. క్యాలరీలు కూడా చాలా తక్కువ. వంద గ్రాముల దోసకాయ నుంచి పదహారు క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వాళ్లు రోజూ మీల్‌‌ టైమ్‌‌లో కీరాదోస తింటే త్వరగా కడుపునిండిన ఫీలింగ్‌‌ కలుగుతుంది. దీనివల్ల తక్కువ ఫుడ్‌‌ తింటారు. బరువు తగ్గుతారు.

పుదీనా: ఏ డ్రింక్‌‌లో అయినా మిక్స్‌‌ చేసుకోగలిగే పుదీనాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఆయిలీ లిక్విడ్స్‌‌ డైజెషన్‌‌ సిస్టమ్‌‌ను ఇంప్రూవ్‌‌ చేస్తాయి. శ్వాస వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. దగ్గు, తలనొప్పిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే కొన్ని ప్రాపర్టీస్‌‌ బరువు తగ్గడంలో సాయం చేస్తాయి.

అల్లం: ఈమధ్య కాలంలో అల్లం వాడకం ఎక్కువైన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్‌‌తో అల్లంతో కషాయం వంటివి తయారు చేసుకుని తాగుతున్నారు. ఇందులో ఉండే ప్రాపర్టీస్‌‌ ఇమ్యూనిటీని పెంచుతాయి. అలసట, అజీర్తి వంటి ప్రాబ్లమ్స్‌‌ను దూరం చేస్తాయి. అల్లం జీర్ణశక్తిని పెంచి, అదనపు కొవ్వు తగ్గడంలో హెల్ప్‌‌ చేస్తుంది. లెమన్‌‌, లేదా ఇతర జ్యూస్‌‌లలో అల్లంను కూడా కలుపుకోవాలి.

పైన చెప్పుకున్న పదార్థాల్ని వేరువేరుగా తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. అయితే, పూర్తి బెనిఫిట్స్‌‌ కావాలంటే వీటన్నింటినీ కలిపి అసలైన డిటాక్స్‌‌ డ్రింక్స్‌‌ తయారు చేసుకోవాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు.

నోట్‌‌: గ్యాస్ట్రిక్‌‌ ప్రాబ్లమ్స్‌‌ ఉన్నవాళ్లు డాక్టర్‌‌‌‌ సలహా ప్రకారం ఈ డిటాక్స్‌‌ తీసుకోవాలి.

లెమన్‌‌–జింజర్‌‌‌‌ డిటాక్స్‌‌ డ్రింక్‌‌

కావాల్సినవి

ఆరెంజ్‌‌ తొనలు: పది గ్రాములు

నిమ్మకాయ: ఒక చెక్క

పైనాపిల్‌‌ క్యూబ్స్‌‌: పది గ్రాములు

కీరా దోస క్యూబ్స్: పది గ్రాములు

అల్లం: ఐదు గ్రాములు

పుదీనా ఆకులు: ఆరు,  నీళ్లు: 200 మి.లీ.

ఐస్‌‌ క్యూబ్స్: ఒక కప్పు

తయారీ

ఒక గ్లాస్‌‌లో నీళ్లు పోసి, మిగిలిన ఇంగ్రెడియెంట్స్‌‌ అన్నీ వేసి కలపాలి. వీటిని అరగంటపాటు అలాగే ఉంచి, తర్వాత వడకట్టి ఆ నీళ్లను తాగాలి.
ఈ నీళ్లలోనే ఐస్‌‌క్యూబ్స్‌‌ వేసుకోవచ్చు.