ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు

ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు

కర్నాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్ వ్యవహారంపై కోర్టు ఇచ్చిన తీర్పు... మతం, సంస్కృతి, వ్యక్తీకరణ, కళ వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇది ముస్లిం మహిళలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వారు టార్గెట్ చేయబడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదన్నారు అసద్. హిజాబ్‌ ధరిస్తే సమస్య ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. 

మరోవైపు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఇదే విషయమై స్పందించారు. కోర్టు తీర్పు చాలా నిరాశజనకమైనదన్నారు. ఓ వైపు మనం మహిళల హక్కులు , వారి సాధికారతపై పెద్ద  పెద్ద వాదనలు చేస్తున్నామన్నారు. మరోవైపు వారు కోరుకున్నది ధరించే హక్కు కూడా మనం వారికి ఇవ్వడం లేదన్నారు. ఈ హక్కు కోర్టులకు ఉండకూడదన్నారు మెహబూబా ముఫ్తీ.