బోనస్‌‌‌‌ షేర్లు ఇస్తున్నరు

బోనస్‌‌‌‌ షేర్లు ఇస్తున్నరు

న్యూఢిల్లీ : కంపెనీలు డివిడెండ్‌‌‌‌లు, బోనస్‌‌ షేర్లు, స్టాక్ స్ప్లిట్‌‌ వంటివి ఎప్పుడు ప్రకటిస్తాయా? అని ఇన్వెస్టర్లు ఎక్కువగా ఎదురు చూస్తుంటారు.  నాలుగు కంపెనీలు ప్రకటించిన బోనస్‌ షేర్ల ఇష్యూ ఈ వారంతో ముగియనుంది. వీటి రికార్డ్ డేట్‌‌ కంటే రెండు రోజుల ముందు షేర్లను కొనుగోలు చేసుకుంటే కంపెనీలు ఇచ్చే బోనస్‌‌ షేర్లు, స్టాక్ స్ప్లిట్‌‌కు ఇన్వెస్టర్లు అర్హత పొందొచ్చు.  ‘రికార్డ్ డేట్’ రోజున ఇన్వెస్టర్ల హోల్డింగ్‌లో  షేర్లు ఉంటే వీటికి అర్హత దక్కుతుంది. బోనస్ షేర్లు అంటే ఇన్వెస్టర్ దగ్గర ఉన్న షేరుకి అదనంగా కొన్ని షేర్లను ఫ్రీగా కంపెనీ ఇవ్వడం. స్టాక్ స్ప్లిట్‌‌లో షేరు ఫేస్‌‌ వాల్యూని డివైడ్ చేసి షేర్ల నెంబర్‌‌‌‌ను పెంచుతారు. ఫలితంగా ఇన్వెస్టర్ దగ్గర ఉన్న షేర్లు పెరుగుతాయి. అదే టైమ్‌‌లో షేరు వాల్యూ తగ్గుతుంది.  

1ఆల్‌‌స్టోన్‌‌ టెక్స్‌‌టైల్స్ (ఇండియా)..

ఈ కంపెనీ  9:1  బోనస్ ఇష్యూని ప్రకటించింది. అంటే 9 షేర్లు ఉన్న షేరు హోల్డర్‌‌‌‌కు ఒక షేరును అదనంగా ఫ్రీగా ఇస్తుంది. అంతేకాకుండా రూ.10  ఫేస్‌‌వాల్యూ షేర్లను రూపాయిగా డివైడ్ చేసేందుకు స్టాక్ స్ప్లిట్‌‌ను ప్రకటించింది. అంటే ఒక షేరు 10 షేర్లుగా (ఉదా. రూ.100 షేరు పది రూ.10 షేర్లుగా మారడం)  మారుతుంది. దీనికి తగ్గట్టు షేరు వాల్యూ కూడా తగ్గుతుంది. డిసెంబర్ 14 నాటికి రికార్డుల్లో షేరు హోల్డర్లుగా ఉన్న వారు ఈ ఇష్యూకు అర్హత పొందుతారు. డిసెంబర్‌‌‌‌ 14 నే  కంపెనీ షేరు ఎక్స్‌‌–బోనస్‌‌, ఎక్స్– స్ప్లిట్‌‌ అవుతుంది. అంటే బోనస్‌‌, స్ప్లిట్‌‌ జరిగిన షేర్లు ఈ తేది నుంచి ట్రేడవుతాయి.  ఆల్‌‌స్టోన్ టెక్స్‌‌టైల్స్‌‌ షేర్లు శుక్రవారం 5 శాతం తగ్గి రూ.170.33 దగ్గర క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.217.10 కోట్లు. 

2 గ్లోస్టర్ లిమిటెడ్‌‌..

జూట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ గ్లోస్టర్‌‌‌‌ లిమిటెడ్‌‌ 1:1  బోనస్ ఇష్యూని నవంబర్ 30 న ప్రకటించింది. ఈ ఇష్యూకి సంబంధించిన రికార్డ్ డేట్‌‌ డిసెంబర్ 17.  డిసెంబర్ 16 నే షేర్లు ఎక్స్‌–  బోనస్‌గా మారుతాయి. గ్లోస్టర్ షేర్లు శుక్రవారం రూ.710 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.152 కోట్లు.  

3 స్టార్ హౌసింగ్ ఫైనాన్స్‌‌..

స్టార్ హౌసింగ్ ఫైనాన్స్‌‌  1:1 బోనస్ ఇష్యూ చేపడుతోంది.    రూ.10 ఫేస్ వాల్యూ ఉన్న షేర్లను రూ.5 కి డివైడ్ చేసే స్టాక్ స్ప్లిట్‌‌ను ప్రకటించింది. వీటికి డిసెంబర్ 16  రికార్డ్ డేట్‌‌. ఈ రోజునే షేర్లు ఎక్స్‌‌–బోనస్‌‌, ఎక్స్–స్ప్లిట్‌‌గా మారుతాయి. స్టార్ హౌసింగ్ ఫైనాన్స్‌‌ షేర్లు  శుక్రవారం 1.52 శాతం పెరిగి రూ.217 వద్ద క్లోజయ్యింది. కంపెనీ షేరు గత ఏడాది కాలంలో  152 శాతం లాభపడగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 149 శాతం  పెరిగింది. 

4 లాన్సర్ కంటైనర్‌‌‌‌ లైన్స్‌‌..

కంపెనీ  రూ.10 ఫేస్‌‌ వాల్యూ షేరును రూ.5 కి డివైడ్ చేసే స్టాక్ స్ప్లిట్‌‌ను ప్రకటించింది. రికార్డ్ డేట్ డిసెంబర్ 16. ఇదే రోజున కంపెనీ షేర్లు ఎక్స్‌‌–స్ప్లిట్‌‌ అవుతాయి.లాన్సర్ కంటైనర్‌‌‌‌ లైన్స్ షేర్లు శుక్రవారం రూ.458 దగ్గర ముగిశాయి.  కంపెనీ మార్కెట్ క్యాప్‌‌ రూ.1,376 కోట్లు. కంపెనీ షేర్లు  ఈ ఏడాది ఇన్వెస్టర్లకు 112 శాతం రిటర్న్ ఇచ్చాయి. 

5 సీఎల్‌‌ ఎడ్యుకేట్‌‌..

ఈ కంపెనీ 1:1 బోనస్ ఇష్యూ ని ప్రకటించింది. అంటే రూ.5 ఫేస్‌‌ వాల్యూ ఉన్న కంపెనీ షేరుకి అదనంగా మరో రూ.5 ఫేస్‌‌వాల్యూ ఉన్న షేరుని ఇస్తారు. డిసెంబర్‌‌‌‌  16 రికార్డ్ డేట్‌‌ కాగా, అదే రోజును ఎక్స్‌‌–బోనస్ డేట్‌‌గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు శుక్రవారం 2 % నష్టపోయి రూ.161 వద్ద క్లోజయ్యాయి. సీఎల్‌‌ ఎడ్యుకేట్ ఈ ఏడాది 34 శాతం పెరిగింది. బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ కు తగ్గట్టు షేరు వాల్యూ తగ్గుతుందని గుర్తుంచుకోవాలి.