మ‌ద్యం షాపులు బంద్..నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

మ‌ద్యం షాపులు బంద్..నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

హైద‌రాబాద్ సీపీ అంజనీ కుమార్ మ‌ద్యం అమ్మ‌కాల‌పై ఆంక్ష‌లు విధించారు. బోనాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ క‌మీష‌న‌రేట్ ప‌రిధిలో ఉన్న మ‌ద్యం దుకాణాల్ని మూసి వేయాల‌ని ఆదేశాలిచ్చారు. బోనాలు జ‌రిగే స‌మ‌యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు జులై 19 ఉద‌యం 6గంట‌ల నుంచి జులై 20 సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌ప‌కూడ‌ద‌ని హెచ్చ‌రించారు. నిబంధ‌న‌లు విరుద్దంగా మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ అంజనీ కుమార్ స్ప‌ష్టం చేశారు.