దుబాయ్: వరల్డ్ చెస్‌లో నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ హవా కొనసాగుతోంది. మాగ్నస్ వరుసగా ఐదోసారి ఫిడే వరల్డ్ చెస్ టైటిల్ సాధించాడు. రష్యాకు చెందిన లాన్ నిపోమ్‌నిషితో జరిగిన 14 రౌండ్ల వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఫైట్‌లో డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన కార్ల్‌సన్ 11వ రౌండ్‌లోనే విక్టరీ సాధించాడు. శుక్రవారం జరిగిన 11వ గేమ్‌లో నార్వే లెజెండ్.. 49 ఎత్తుల్లో నిపోమ్‌నిషిని ఓడించాడు. ఈ రౌండ్ ముగిసేసరికి మాగ్నస్ 7.5–3.5తో లీడ్‌లోకి వచ్చాడు. మిగిలిన మూడు గేమ్స్‌లో ఫలితం లేకపోవడంతో నిపోమ్‌నిషి ఓటమి అంగీకరించాడు. దాంతో, 2013లో తొలిసారి వరల్డ్ చాంప్‌గా నిలిచిన కార్ల్‌సన్ ఐదో టైటిల్ అందుకున్నాడు.
