హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ ఇద్దరు రెజ్లర్లును దింపుతోంది. బబితా పొగట్, యోగేశ్వర్ దత్‌లకు టికెట్లు ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే 78 మంది అభ్యర్ధుల పేర్లను ఇవాళ (సోమవారం) ప్రకటించింది.
సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయనున్నారు. ప్రముఖ క్రీడాకారులు బబితా పొగట్, యోగేశ్వర్ దత్‌లకు బీజేపీ టికెట్లు దక్కాయి. మొదటి లిస్టులో 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి పోటీ చేసే అవకాశం లభించగా, ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తొహన నుంచి, పొగట్ దరి నుంచి బరిలో నిలుస్తారు. యోగేశ్వర్ దత్‌కు బరోడా స్ధానం కేటాయించారు.


