V6 News

స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ తప్పనిసరి కాదు: కేంద్రం యూటర్న్

స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ తప్పనిసరి కాదు: కేంద్రం యూటర్న్

స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలనే నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది.యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 

డివైజ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అనుకూలత ,.డేటా గోప్యత వంటి అంశాలపై ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు UIDAI పేర్కొంది.

యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, భారతీయ మార్కెట్ కు ప్రత్యేక తయారీ విధానాలు అవసరమ వుతాయని కంపెనీలు తెలిపాయి. యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేక తయారీ లైన్లు అవసరమవుతాయని కంపెనీలు చెప్పాయి. ఆధార్ యాప్‌ను తప్పనిసరి చేయాలనే ప్రయత్నం గత రెండేళ్లలో ఆరోసారి కాగా, ఇండస్ట్రీ నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.