V6 News

సాయంత్రం యెడ్యూరప్ప ప్రమాణం.. 31లోగా బలపరీక్ష

సాయంత్రం యెడ్యూరప్ప ప్రమాణం.. 31లోగా బలపరీక్ష

జులై 31లోగా బీజేపీకి బలపరీక్ష

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యెడ్యూరప్ప ఈ సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం కావడం ఇది ఆయనకు నాలుగోసారి. బీజేఎల్పీ నాయకుడైన బీఎస్ యడ్యూరప్ప.. పార్టీ అధిష్ఠానం సూచనలతో ఈ ఉదయం బెంగళూరులో రాజ్ భవన్ కు వెళ్లారు. ముఖ్యమంత్రిగా తనకు ఎన్నుకుంటూ బీజేపీ శాసనసభాపక్షం చేసిన తీర్మాన ప్రతిని గవర్నర్ కు అందజేశారు. దీంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్… యెడ్యూరప్పను ఆహ్వానించారు. ఈ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నట్టు గవర్నర్ కు చెప్పారు యెడ్యూరప్ప.

ఈ సందర్భంగా గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం ఈ నెలాఖరు అంటే.. జులై 31 లోగా.. ఎప్పుడైనా అసెంబ్లీని సమావేశ పరిచి.. మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుందని గవర్నర్ కార్యాలయం తెలిపింది.