ఏటీఎంలలో ఫుల్ క్యాష్ పెట్టినం

ఏటీఎంలలో ఫుల్ క్యాష్ పెట్టినం

ఏటీఎంలలోఫుల్ క్యాష్ పెట్టినం
నేటి నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్​ సేవలు: యెస్​బ్యాంక్​

ముంబై : యెస్ బ్యాంక్ ఏటీఎంలు, బ్రాంచ్‌‌లన్నింటిలో సరిపడా క్యాష్‌‌ ఉందని ఈ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌ ప్రశాంత్ కుమార్ చెప్పారు. లిక్విడిటీ విషయంలో ఎలాంటి సమస్య లేదన్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తమ సర్వీసులన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. మారిటోరియం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు మాదిరి కస్టమర్లు అన్ని రకాల సర్వీసులను యెస్ బ్యాంక్ ద్వారా పొందవచ్చని క్లారిటీ ఇచ్చారు. ఈక్విటీ ఇన్‌‌ఫ్యూజన్ మాత్రమే కాక, యెస్ బ్యాంక్‌‌లోని మా టీమ్ ఎప్పడికప్పుడు కస్టమర్లతో కమ్యూనికేట్ అవుతుందని చెప్పారు. నెఫ్ట్, ఆర్‌‌‌‌టీజీఎస్, ఐఎంపీఎస్ సర్వీసులన్ని అందుబాటులో ఉంటాయన్నారు. కష్టాల్లో ఉన్న యెస్ బ్యాంక్‌‌ను బయట పడేయడానికి ప్రభుత్వం, ఆర్‌‌‌‌బీఐ ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సీఈఓ ప్రశాంతే ?

బ్యాంకింగ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపే యెస్ బ్యాంక్‌‌ను రక్షించేందుకు, మొట్టమొదటిసారి ఎనిమిది బ్యాంక్‌‌లు కలిసి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని ప్రశాంత్ కుమార్ తెలిపారు. యెస్ బ్యాంక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ మారిటోరియం విధించిన తర్వాత ఎస్‌‌బీఐ మాజీ డిప్యూటీ ఎండీ అయిన ప్రశాంత్ కుమార్ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌గా అపాయింట్ అయ్యారు. రీకన్‌‌స్ట్రక్టెడ్‌‌ యెస్ బ్యాంక్‌‌కు ఈయన సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. యెస్ బ్యాంక్‌‌లో అవుట్‌‌ఫ్లోస్ కంటే ఇన్‌‌ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయని వివరించారు. మారిటోరియం కాలంలో మూడింట ఒక వంతు కస్టమర్లు మాత్రమే రూ.50 వేలు విత్‌‌డ్రా చేసుకున్నారని చెప్పారు. యెస్ బ్యాంక్‌‌లో ఇన్వెస్ట్ చేస్తోన్న ఎస్‌‌బీఐ.. రెండో రౌండ్ ఫండింగ్‌‌లో వాటాను 42 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోనుందని ఎస్‌‌బీఐ ఛైర్మన్ రజ్‌‌నీష్ కుమార్ చెప్పారు. మూడేళ్ల లాకిన్ పిరియడ్‌‌కు ముందు యెస్ బ్యాంక్‌‌లో ఒక షేరును కూడా అమ్మబోమని క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల నేపథ్యంలో యెస్ బ్యాంక్ షేర్లు 60 శాతం మేర పెరిగాయి.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత