టైం కాకుండా ఉండాలంటే ఈ గాడ్జెట్స్ ‌‌ వాడాల్సిందేే.. !

టైం కాకుండా ఉండాలంటే ఈ గాడ్జెట్స్ ‌‌ వాడాల్సిందేే.. !

చిన్న పనులకు కొన్ని గాడ్జెట్స్ ‌ఫ్రూట్స్ ‌‌, కూరగాయలు కట్ ‌‌ చేయడం.. లాంటివి చిన్న చిన్న పనులే కానీ.. చాలా టైం పడుతుంది. కానీ.. ఈ టెక్ ‌‌ యుగంలో టైం చాలా విలువైనది. అందుకే మన టైం ఇలాంటి చిన్న చిన్న పనుల కోసం వేస్ట్ ‌‌ కాకుండా ఉండాలంటే కొన్ని గాడ్జెట్స్ ‌‌ వాడితే సరిపోతుంది. 

స్పైరల్ కట్టర్ ‌‌ ‌‌

ఆలుగడ్డలతో చిప్స్ ‌‌ చేసుకోవాలన్నా.. కీరదోస కాయలు తినాలన్నా సన్నగా కట్ ‌‌చేయాలి. అయితే ఒక్కో ముక్క కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ.. ఈ చిన్న టూల్ ‌‌ ఉపయోగిస్తే.. చాలా తక్కువ టైంలో కట్ చేయొచ్చు. దీన్ని వాడడం కూడా చాలా ఈజీ. ఈ టూల్​ని ఫుడ్ ‌‌ గ్రేడ్ ప్లాస్టిక్​తో తయారుచేస్తారు. దీంతో పాటు స్టీల్​ చువ్వలు కూడా వస్తాయి. వాటికి ఆలుగడ్డలను గుచ్చి స్పైరల్ చేస్తే ఇంకాస్త ఈజీ అవుతుంది.
ధర: క్వాలిటీ, సైజుని బట్టి 100 రూపాయల నుంచి మొదలు

కోర్ రిమూవర్ ‌‌ ‌‌ 

యాపిల్ కట్ ‌‌చేసిన ప్రతిసారి మధ్యలో ఉండే భాగాన్ని తీయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. వాటిని తీయకుండా తినలేం. అందుకే కొన్ని కంపెనీలు రకరకాల కోర్ రిమూవర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో యాపిల్​‌‌లోని మధ్య భాగాన్ని ఈజీగా తీసేయొచ్చు. ఇది అన్ని సైజుల యాపిల్స్ ‌‌కి సరిపోతుంది. అయితే.. మార్కెట్ ‌‌లో అనేక రకాల యాపిల్ కోర్  రిమూవర్లు ఉన్నా.. ఈ మోడల్ బాగా సక్సెస్ అయింది. ఎక్కువమంది ఇలాంటివే వాడుతుంటారు. 
ధర: క్వాలిటీని బట్టి 100 రూపాయల నుంచి మొదలు

ప్రెస్ ‌‌.. కట్ ‌‌

కూరగాయలు కట్ ‌‌ చేయడం ఈజీగా, ఫాస్ట్​గా అయిపోవడానికి కొన్ని కంపెనీలు చాపర్​లని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటిలో తక్కువ ధరలో దొరికే, ఈజీగా వాడగలిగే మోడల్ ‌‌ ఇది. మామూలు చాపర్​తో కూరగాయలు కట్ ‌‌చేయడానికి కాస్త ఎక్కువ బలం ఉపయోగించాలి. కానీ.. దీంతో కూరగాయలు కట్ చేయడం చాలా ఈజీ. చాపింగ్ బాక్స్ ‌‌లో వెజిటబుల్స్ ‌‌ వేసి, దానిపైన ఉన్న హ్యాండిల్​ని కిందికి నొక్కితే చాలు. కూరగాయలు కట్ ‌‌ అయిపోతాయి. ఎంత చిన్న ముక్కలు కావాలంటే.. అన్ని ఎక్కువసార్లు నొక్కాలి. 
ధర : క్వాలిటీని బట్టి 250 రూపాయల నుంచి మొదలు

ఫ్లోర్ సిఫ్టర్ ‌‌ ‌‌

ఫుడ్ బేక్ ‌‌ చేసేటప్పుడు కొన్ని వంటకాలపై పిండి చల్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చేతితో చల్లితే ఒకచోట ఎక్కువ, మరో చోట తక్కువగా పడుతుంది. కానీ.. ఈ ఫ్లోర్ ‌‌ ‌‌ సిఫ్టర్​తో చల్లితే సమానంగా పడుతుంది. అంతేకాదు.. పిండిలో సన్నని రాళ్లున్నా, చెత్త ఉన్నా ఇది ఫిల్టర్ ‌‌ ‌‌ చేస్తుంది. దీన్ని ఈజీగా వాడొచ్చు. టీ కప్పు ఆకారంలో ఉంటుంది. హ్యాండిల్​కి ఆనుకుని ఒక స్టీల్ రాడ్ ఉంటుంది. దాన్ని నొక్కితే.. అడుగు భాగం నుంచి పిండి కిందకి వస్తుంది.  
ధర: 350 రూపాయల నుంచి మొదలు