ఫ్లైఓవర్ మీది నుంచి దూకి యువతి ఆత్మాహత్యయత్నం

ఫ్లైఓవర్ మీది నుంచి దూకి యువతి ఆత్మాహత్యయత్నం

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీది నుంచి దూకి ఓ యవతి ఆత్మాహత్యాయత్నం చేసింది.బ్రిడ్జిపై నుంచి కిందికి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని హుటాహుటిన అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. యువతి కాళ్లు, వెన్ను భాగంలో తీవ్రగాయాలయ్యాయి. యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.