ఇస్లాబామాద్: సౌదీ-హౌతీ యుద్ధంలోకి పాకిస్థాన్ ఎంట్రీ ఇవ్వనుందా..? మిడిల్ ఈస్ట్ వార్ మరింత ముదురనుందా..? అంటే పాకిస్థాన్ రక్షణ మంత్రి అసిఫ్ ఖవాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్ ఫ్రాక్సీ గ్రూప్ హౌతీ, సౌదీ అరేబియా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. సౌదీలోని ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం మక్కాపై హౌతీలు దాడికి ప్రయత్నించడం.. హౌతీల దాడులను సౌదీ దళాలు తిప్పకొట్టడంతో మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.
ఈ క్రమంలో హౌతీ, సౌదీ అరేబియా ఘర్షణలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి అసిఫ్ ఖవాజా స్పందించారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌లోని నిబంధనల ప్రకారం స్పందించడానికి.. తమ బాధ్యతలను నెరవేర్చడానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని ప్రకటించారు. అయితే, ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడంపై పాకిస్థాన్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ముస్లింల పవిత్ర నగరం మక్కాపై దాడి జరిగితే దానిని రక్షించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదన్నారు. పవిత్ర స్థలాలను కాపాడటం అనేది ఒప్పందంతో సంబంధం లేని ఒక స్వతంత్ర బాధ్యత అని పేర్కొన్నారు. సౌదీ అరేబియాపై హౌతీల దాడుల అంశాన్ని ఇరాన్‌తో కూడా చర్చించామని ఖవాజా తెలిపారు. కాగా, మక్కాపై హౌతీల దాడి ప్రయత్నాన్ని పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది.
ఏంటీ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్..?
టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య 2026, ఆగస్ట్‌లో చారిత్రాత్మక మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగిన దానిని మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఈ ఒప్పందం పూర్తిగా రక్షణ సామర్థ్యాల కోసమేనని, తాము వేరే దేశంపై ముందస్తుగా దాడి చేయడానికి ఉద్దేశించింది కాదని ఒప్పందంలో పేర్కొన్నారు.
►ALSO READ | బ్రిక్స్ సదస్సులో ప్రపంచ నేతలకు అస్వస్థత.. నిజం బయటపెట్టిన విదేశాంగ శాఖ
మక్కా ఒప్పందంలో సభ్య దేశమైన సౌదీ అరేబియా దాడులు చేస్తుండటంతో.. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఒప్పందానికి కట్టుబడి పాకిస్తాన్ రంగంలోకి దిగితే మాత్రం ఈ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చనుందంటున్నారు అంతర్జాతీయ భౌగోళిక విశ్లేషకులు. ఈ క్రమంలో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనడంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా పై విధంగా క్లారిటీ ఇచ్చారు.
