Harmanpreet Kaur: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో అకామడేషన్ రచ్చ తీవ్ర కలకలం రేపుతుంది. అథ్లెట్లకు గదులు కేటాయించడంలో తీవ్ర ఆలస్యమైంది, క్రూయిజ్ షిప్‌లలో భారత అథ్లెట్లతో సహా పలువురు ఏకంగా 12 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ వివాదంపై ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
10 నిమిషాల్లో రూమ్ ఇచ్చారు: హర్మన్
జపాన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. మాకు ఇక్కడేం సమస్యలు రాలేదు.. ప్రతిసారీ లభించినట్లే ఈసారి కూడా జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లోనే రూమ్స్ ఇచ్చేశారు.. చెక్-ఇన్ ప్రాసెస్ చాలా స్మూత్‌గా సాగిందని హర్మన్ వెల్లడించింది. బయట మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు కానీ, ఇక్కడి సిబ్బంది చాలా బాగా ఆదరించారు.. మాకు ఏది కావాలన్నా వెంటనే సహాయం చేశారు. సౌకర్యాల పట్ల మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామని తేల్చిచెప్పేసింది.
మా వైపు నుంచి నో కంప్లైంట్స్: హెడ్ కోచ్
హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యలకు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ కూడా పూర్తి మద్దతు ఇచ్చాడు. జపాన్‌లో అకామడేషన్ ఏరియా చాలా బాగుంది, తమ జట్టు వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని ముజుందార్ స్పష్టం చేశాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఏర్పాట్లు సజావుగా కొనసాగాయని తెలిపాడు.
►ALSO READ | ఆఫ్ఘన్‌తో 3వ టీ20లో టీమిండియా ప్రయోగాలు.. వైభవ్‌తో పాటు బెంచ్ ఆటగాళ్లకు ఛాన్స్!
గోల్డ్ మెడల్ డిఫెన్స్.. జపాన్‌తో క్వార్టర్ ఫైనల్:
అకామడేషన్ రచ్చకు స్వస్తి చెప్పిన విమెన్స్ ఇన్ బ్లూ.. ఇప్పుడు పూర్తి ఫోకస్ మైదానంపైనే పెట్టింది. సెప్టెంబర్ 18వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ జట్టుతో భారత్ తలపడనుంది. 2023 హాంగ్‌జౌ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, ఈసారి కూడా పసిడి వేటను విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉంది.
🇮🇳 INDIAN WOMEN’S TEAM HAPPY WITH THE ACCOMMODATION IN JAPAN! 🇯🇵❤️
— Sonu Jaat (@TheSonuJaat) September 17, 2026
Amol Muzumdar: “We don’t have any complaints. The accommodation is nice and everything was absolutely spotless.”
Harmanpreet Kaur: “People here are very nice and welcoming. Whatever we needed, they provided. We… pic.twitter.com/c2sDviRPi0
