ఆఫ్ఘన్‌తో 3వ టీ20లో టీమిండియా ప్రయోగాలు.. వైభవ్‌తో పాటు బెంచ్ ఆటగాళ్లకు ఛాన్స్!

ఆఫ్ఘన్‌తో 3వ టీ20లో టీమిండియా ప్రయోగాలు.. వైభవ్‌తో పాటు బెంచ్ ఆటగాళ్లకు ఛాన్స్!

AFG vs IND 3rd T20: ఆఫ్ఘనిస్థాన్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాలు సాధించి సిరీస్‌ను 2–0 తేడాతో చేజిక్కించుకున్న టీమిండియా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఆఖరి టీ20 సమరానికి సిద్ధమైంది. సిరీస్ విజేత ఇప్పటికే ఖరారు కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి భారత బెంచ్ బలంపై, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా లేదా అనేదానిపైనే ఉత్కంఠ నెలకొంది.

బెంచ్ ప్లేయర్లకు ఛాన్స్ ఉందా: 

రెండో టీ20 అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. రిజర్వ్ బెంచ్ మీద ఉన్న ప్లేయర్లకు తుది జట్టులో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందని పేర్కొన్నాడు. మిగిలిన ఆటగాళ్లకు కూడా పిచ్ వాతావరణం అలవాటు పడేందుకు, మ్యాచ్ ప్రాక్టీస్ పొందేందుకు ఇది మంచి అవకాశం.. మ్యాచ్ ఆడకుండా బయట ఉన్న వారికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నామని శ్రేయస్ స్పష్టం చేశాడు.

సంజు వర్సెస్ వైభవ్: 

జింబాబ్వే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి వైభవ్ సూర్యవంశీకి, సంజు శాంసన్ రీఎంట్రీతో ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ సంజు గత మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకోగా, అభిషేక్ శర్మ కూడా ధాటిగా ఆడుతున్నాడు. ఒకవేళ వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటే ఓపెనింగ్ ఆర్డర్‌లో పెద్ద మార్పులే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఛాన్స్ వస్తే, స్వదేశంలో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టిస్తాడు.

రేసులో వాషింగ్టన్, యశ్ ఠాకూర్: 

వరస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సైడ్ స్ట్రెయిన్ గాయంతో దూరం కావడం జట్టులో మరో మార్పుకు దారితీసింది. 

* స్పిన్ / పేస్ ఆప్షన్లు: వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. అలాగే యశ్ ఠాకూర్‌కు మరో ఛాన్స్ లభించవచ్చు.  

* నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు: ఆల్‌రౌండర్లపై కాకుండా కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగి బ్యాటింగ్ లోతు తగ్గినప్పుడు జట్టు ఎలా స్పందిస్తుందో పరీక్షించేందుకు యాజమాన్యం ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. 

►ALSO READ | వెస్టిండీస్‌తో భారత్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ XI ఇదే: మరీ ఆకిబ్ నబీకి గిల్ ఛాన్స్ దక్కేనా?

చివరి టీ20లో ఆఫ్ఘనిస్థాన్ పోరాటం: 

* వరుస ఓటములతో సిరీస్ కోల్పోయిన ఇబ్రహీం జద్రాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్, ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది.

* బ్యాటింగ్ బాధ్యత: ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంది.

* రషీద్ ఖాన్ మైలురాయి: ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ మరో 4 వికెట్లు తీస్తే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఇక పేసర్ నవీన్ ఉల్ హక్ ఫిట్‌నెస్ సాధిస్తే జట్టులోకి రావచ్చు.

పిచ్,  ప్రత్యక్ష ప్రసారం: 

* పిచ్ తీరు: అరుణ్ జైట్లీ స్టేడియం చిన్న బౌండరీలతో బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

* వాతావరణం: వర్షం పడే సూచనలు స్వల్పంగా ఉన్నప్పటికీ మ్యాచ్‌కు పెద్దగా అంతరాయం కలగకపోవచ్చు.  

* టైమింగ్, లైవ్ ప్రసారం: మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports), ఫ్యాన్‌కోడ్ (FanCode) యాప్‌లో లైవ్ ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

అంచనా తుది జట్లు: 

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్/వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, రవి బిష్ణోయ్/యశ్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), సెదికుల్లా అటల్, గుల్బదిన్ నైబ్, దర్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్/నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూకీ.