క్విక్ కామర్స్ కంపెనీల్లో డబ్బులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు దూరం

క్విక్ కామర్స్ కంపెనీల్లో డబ్బులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు దూరం
  • కొత్త కస్టమర్లు పొందడంలో సవాళ్లు
  • ఆఫర్లు ఇచ్చే పొజిషన్‌‌‌‌‌‌‌‌లో లేని కంపెనీలు
  • ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పది నిమిషాలకే గ్రోసరీ డెలివరీ అంటూ రెండేళ్ల కిందట కొత్త బిజినెస్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్  చేసిన క్విక్ కామర్స్ కంపెనీలు ప్రస్తుతం బతకడానికి ఇబ్బంది పడుతున్నాయి. కొత్త ఫండింగ్ అందకపోవడంతో చాలా కంపెనీలు నష్టాల్లో  నడుస్తున్నాయి. జెప్టో,  స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టామార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జొమాటో బ్లింకిట్, బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్, డంజో వంటి కంపెనీలు లాభాల్లోకి రావాలంటే యూజర్ల బేస్ ఎక్కువగా ఉండాలి. ఈ కంపెనీలు ఏర్పాటు చేసిన డార్క్ స్టోర్ల (డెలివరీ చేయడానికి ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఒక దగ్గర నిల్వ చేసే ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చుట్టుపక్కల రోజుకి కనీసం 800 ఆర్డర్లు డెలివరీ చేసేటట్టు  ఉండాలి. కానీ, 2020 లో ఉన్నట్టు ప్రస్తుత  పరిస్థితులు లేవు. క్విక్ కామర్స్ కంపెనీలు కొత్త కస్టమర్లను పొందడంలో ఇబ్బందులు పడుతున్నాయి. టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డంజో   వంటి పెద్ద కంపెనీల సపోర్ట్ ఉన్న స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  ఈ ఏడాది ఎలాగోలా నెట్టుకు రాగలవు కాని చిన్న స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మాత్రం కష్టాలు తప్పవు. క్విక్ కామర్స్ కంపెనీలకు సగటు ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి  కమీషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడ్వర్టయిజింగ్, కస్టమర్ డెలివరీ ఛార్జీలు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది.  కానీ,  ఇవి ఆర్డర్లను స్టోర్ చేయడానికి  డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. డెలివరీ పార్టనర్లకు అయ్యే ఖర్చులు, కస్టమర్లను ఆకర్షించడానికి ఇచ్చే డిస్కౌంట్ల భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఫలితంగా  క్విక్ కామర్స్ కంపెనీలకు వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. 

కొత్త కస్టమర్లు చేరడం లేదు..

కొత్త కస్టమర్లు రావడం తగ్గిందని స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టామార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన టాప్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ‘రోజుకి 3 లక్షల ఆర్డర్లను చేరుకోవడం ఈజీగానే జరిగింది. కానీ, 3 నుంచి 4 లక్షలకు చేరుకోవడానికి టైమ్ పడుతోంది’ అని వివరించారు.  దేశంలోని టాప్ 8 సిటీలకు వెలుపల ఆర్డర్లు రావడం తగ్గిందని, ఇంకా డెలివరీ పార్టనర్లు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.  లాభదాయకం కాని  డార్క్ స్టోర్లను తొలగిస్తున్నామని  జొమాటో బ్లింకిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన  వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. రూరల్ బెంగళూరులో తమకు 60 డార్క్ స్టోర్లు ఉంటే వీటిని 50 కి తగ్గించామని అన్నారు. ఇవన్నీ సిటీ అవుట్ స్కర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో వీటిని మెయింటైన్ చేయడం లాభదాయకంగా లేదని అన్నారు. ‘కొత్త  స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేస్తాం. అది లాభదాయకంగా మారడానికి  టైమ్ పడుతుంది. అందుకే ఎక్కువ ఆర్డర్లు రావడం కీలకం. కస్టమర్లను ఆకర్షించడానికి డబ్బులు బాగా ఖర్చు చేయాలి. కానీ, ఇటువంటి విధానంపై  ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అనుకోవడం లేదు’ అని బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్ సీఈఓ హరి మీనన్ పేర్కొన్నారు.  ఇప్పటికే రీజనబుల్ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కస్టమర్ల  బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించిన స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టామార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్, బ్లింకిట్ వంటి కంపెనీలు ఈ ఏడాది పాత కస్టమర్లతోనైనా నెట్టుకొస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. కానీ, పాత కస్టమర్లు కూడా ఎక్కువ ఆర్డర్లు పెట్టేలా చేయాలని అన్నారు. రూ.999 కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఆర్డర్లను కస్టమర్లతో పెట్టించేందుకు క్విక్ కామర్స్ కంపెనీలు తంటాలు పడుతున్నాయి. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. యావరేజ్ ఆర్డర్ వాల్యూ పెరిగితేనే ఇటువంటి కంపెనీలు భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలబడగలుగుతాయని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు.

డీల్స్ తగ్గిపోయాయి..

టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు,  క్విక్ కామర్స్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కిందటేడాది ఫండింగ్ పొందడంలో చాలా ఇబ్బందులు పడ్డాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు క్యాష్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎక్కువగా ఖర్చు చేసే కంపెనీలకు దూరంగా ఉంటున్నాయి. అందుకే ఒకప్పుడు హై వాల్యుయేషన్ పలికిన కంపెనీలు ప్రస్తుతం ఫండింగ్ సేకరించడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఫండ్స్ సేకరించడానికి కిందటేడాది మొత్తం వివిధ ప్రయత్నాలు చేసిన జెప్టో, ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమైంది. కొత్త ఏడాదిలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఉంటాయని, లాభాల్లోకి రావడంపై కంపెనీలు  పూర్తిగా ఫోకస్ పెట్టాలని బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ హరి మీనన్ అన్నారు. అవసరం లేని చోట ఇన్వెస్ట్ చేసిన ఖర్చులను తగ్గించుకోవాలని సలహాయిచ్చారు.