
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన విమానాశ్రయ సంబంధిత వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డబ్ల్యూఏఐఎస్‌ఎల్‌లో 8.4 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను బలోపేతం చేసే లక్ష్యంతో కంపెనీ 4,60,000 షేర్లను ఉత్తిష్ట విరాట్ ఫండ్ నుండి రూ.56.66 కోట్లకు కొనుగోలు చేసింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. జీఏఎల్ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, గోవా ఫిలిప్పీన్స్‌లోని విమానాశ్రయాలను నిర్వహిస్తుంది. విమానాశ్రయ వ్యాపారాలను బలోపేతం చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.