వరంగల్‍ పార్లమెంట్ ఓటర్లు 18 లక్షల 24 వేల 466

వరంగల్‍ పార్లమెంట్ ఓటర్లు 18 లక్షల 24 వేల 466
  • లోక్‍సభ స్థానంలో పెరిగిన 2.86 లక్షల ఓట్లు  

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ ఎస్సీ రిజర్వేషన్‍ పార్లమెంట్‍ స్థానంలో ఓటర్ల సంఖ్య తేలింది. ఓటు హక్కు పొందడానికి అధికారులు 2024 ఏప్రిల్‍ 26న ప్రకటించిన తుది ఓటర్‍ జాబితా ప్రకారం పార్లమెంట్‍ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 18 లక్షల 24 వేల 466 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 15,37,781 మంది ఉండగా, ఇప్పుడు 2 లక్షల 86 వేల 781 మంది ఓట్లర్లు పెరిగారు. కాగా, వరంగల్‍ లోక్‍సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా, మొత్తంగా 1900 పోలింగ్‍ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 

మహిళా ఓటర్లే ఎక్కువ..

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‍సభ ఎన్నికల్లోనూ మహిళ ఓటర్ల హవా కొనసాగుతోంది. కొత్త ఓటర్‍ జాబితా ప్రకారం వరంగల్‍ పార్లమెంట్‍ పరిధిలో మహిళా ఓట్లర్లు ఎక్కువగా ఉన్నారు. 7 నియోజకవర్గాల పరిధిలో పురుషుల కంటే మహిళా 33,227 మంది ఎక్కువగా ఉన్నారు. ఏడు నియోజకవర్గాల్లో పశ్చిమ వరంగల్‍లో అత్యధికంగా 2,83,446 మంది ఓటర్లు ఉంటే, అత్యల్పంగా పరకాల నియోజకవర్గంలో 2,22,383 ఓటర్లు ఉన్నారు.  కొత్తగా ఓటు హక్కు పొందినవారిలో పాలకుర్తిలో అత్యధికంగా 8,725 మంది ఉండగా, అత్యల్పంగా తూర్పు వరంగల్‍లో 6,038 మంది ఓటర్లు ఉన్నారు.

సర్వీస్‍ ఓటర్లు అత్యధికంగా భూపాలపల్లిలో 194, అత్యల్పంగా వరంగల్‍ పశ్చిమలో 70 ఉండగా, సీనియర్‍ సిటిజన్‍ ఓటర్లు అత్యధికంగా పాలకుర్తిలో 2,400, అత్యల్పంగా తూర్పు వరంగల్‍లో 1,487 మంది, దివ్యాంగ ఓటర్లు అత్యధికంగా స్టేషన్‍ ఘన్‍పూర్‍లో 5,618 ఉండగా, అత్యల్పంగా పశ్చిమ వరంగల్‍లో 2,205 ఓటర్లు ఉన్నారు. ఎన్‍ఆర్‍ఐ ఓటర్లు అత్యధికంగా వరంగల్‍ పశ్చిమలో 96 మంది, అత్యల్పంగా పరకాల నియోజకవర్గంలో ముగ్గురే ఉన్నారు.