మెదక్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో మెదక్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం మంత్రిని సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని, తద్వారా ప్రజాప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
