ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా దాడులతో..క్రూడ్‌ ఆయిల్‌కు రెక్కలు

ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా దాడులతో..క్రూడ్‌ ఆయిల్‌కు రెక్కలు
  • ఇప్పటికే 73 డాలర్లకు చేరిన బ్రెంట్ 
  • మన ఆయిల్ దిగుమతి ఖర్చు పెరగొచ్చు
  • ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లు పైకి!

న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌‌‌‌పై దాడులు చేయడంతో   క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.  మిడిల్ ఈస్ట్ స్టేబుల్‌గా లేకపోతే ఇండియాకు కూడా నష్టమే. మనం 90శాతం క్రూడ్ ఆయిల్‌‌‌‌ను  దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో  సుమారు 50 శాతం ఇరాన్‌‌‌‌, ఇరాక్‌‌‌‌, సౌదీ, యూఏఈ, కువైట్ నుంచి  హోర్మూజ్‌‌‌‌ జలసంధి మార్గంలో రవాణా అవుతోంది.   

తాజా ఉద్రిక్తతల వలన గత వారం రోజుల్లో బ్రెంట్ క్రూడ్ ధర 3 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌‌‌‌కు 72–--73 డాలర్లకి చేరింది. హోర్మూజ్‌‌‌‌ జలసంధిలో రవాణాకు అంతరాయం వస్తే ఈ రేటు మరింత పెరిగి 90-120 డాలర్లకు చేరొచ్చని, ఈ జలసంధి ఒక్కరోజు మూతపడినా ఆయిల్ ధరలు--150 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే  ఇండియా ఆయిల్ దిగుమతుల ఖర్చు అమాంతం పెరుగుతుంది. 

దీంతో రూపాయి విలువ పడుతుంది. క్రూడ్​ ధరలు పెరగడంతో ట్రాన్స్‌‌‌‌పోర్ట్, ఫుడ్, మాన్యుఫాక్చరింగ్ కాస్ట్స్ పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువవుతుంది. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లను పెంచొచ్చు కూడా. అప్పుడు హోమ్‌‌‌‌, ఆటో వంటి రెపో లింక్డ్ లోన్లపై ఈఎంఐ పెరుగుతుంది. జనంపై భారం పడుతుంది. ఇదిలా ఉంటే, దాడుల కారణంగా బంగారం, వెండి ధరలూ పెరిగాయి. 

హైదరాబాద్​లో పది గ్రాముల ధర రూ.ఏడు వేలు పెరిగిరూ.1.73,500లకు చేరింది. కేజీ వెండి రూ.2.99 లక్షలకు చేరింది. గ్లోబల్‌గానూ వీటి ధరలు  భారీగా పెరిగాయని బులియన్​ వ్యాపారులు తెలిపారు.