సామ్సంగ్ గెలాక్సీ, నథింగ్ఫోన్, పోకో స్మార్ట్ఫోన్లపై భారీడిస్కౌంట్

సామ్సంగ్ గెలాక్సీ, నథింగ్ఫోన్, పోకో స్మార్ట్ఫోన్లపై భారీడిస్కౌంట్

ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2024: తక్కువ ధర, ఫ్రెండ్లీ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్..ప్రముఖ కంపెనీలకు చెందిన అన్ని స్మార్ట్ ఫోన్లపై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.స్టాండ్ అవుట్ డీల్స్ లో వివిధ హ్యాండ్ సెట్లపై తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్  బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో అన్ని రకాల మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ మే 9 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ లభించే స్మార్ట్ ఫోన్ల ధర, డిస్కౌంట్ లు,ఇతర వివరాలను తెలుసుకుందాం. 

ఈ ఆఫర్ లో స్టాండ్ అవుట్ డీల్స్ లో Motorola Edge 50 Pro ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 27,999 మాత్రమే.Moto Edge 40 Neo ధర రూ. 19,999. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను ఆశించే వినియోగదారులకు Moto G64 రూ. 12,999లకు, Moto G34  రూ. 9,999 ధరలకు మంచి డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఫ్రెండ్లీ బడ్జెట్ లో Poco M6 ధర ₹ 7,999 తో అందిస్తోంది. అదనంగా Poco X6 Pro, Poco M6 Pro , Vivo T3 వంటి స్మార్ట్ ఫోన్లను కూడా డిస్కౌంట్ తో లభిస్తాయి. Poco X6  ను కేవలం రూ.17,999తో అందిస్తోంది. iPhone 12 రూ.39,499 వద్ద లభిస్తాయి. 
.
Google Pixel సిరీస్‌లో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికి Pixel 7a హ్యాండ్ సెట్ ను ప్రత్యేక ఆఫర్‌లతో ధర రూ.31,999 కి తగ్గింపుతో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ లో మరో హ్యాండ్ సెట్ Pixel 8 ఆకర్షణీయమైన ధర రూ.49,999 వద్ద అందుబాటులో ఉంటుంది . ఇంకా iPhone 14, ప్రస్తుతం రూ.55,999, ఐఫోన్ 15 మోడల్‌పై తగ్గింపులను కూడా అందిస్తుంది.

నథింగ్ ఫోన్ (2a) Poco X6 Pro, iPhone 14 Plus, Samsung Galaxy S23 FE , Vivo T2 ప్రో వంటి డివైజ్‌లపై గణనీయమైన ధర తగ్గింపులను టీజ్ చేసింది. ముఖ్యంగా Galaxy S23, Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు అందిస్తోంది. Galaxy S23 మునుపటి ధర రూ. 44,999 కంటే తక్కువ , Galaxy S23 FE  రూ. 39,999 కంటే తక్కువ.